భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ బిల్డింగ్​ఇంకా పూర్తి కాలే

భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ బిల్డింగ్​ఇంకా పూర్తి కాలే

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి 100 ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ సీట్లను కేటాయిస్తూ నేషనల్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌(ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ) ఆర్డర్స్​ ఇచ్చింది. 2023‒24 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌  చేసుకోవచ్చని చెప్పింది. అవసరమైన స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్​మెంట్​ చేపట్టాలని సూచించింది.  అయితే క్లాస్‌‌‌‌ల నిర్వహణ, స్టూడెంట్స్ హాస్టల్‌‌‌‌, లైబ్రరీ.. తదితర వాటికోసం నిర్మిస్తున్న బిల్డింగ్​ఇంకా పూర్తి కాలే. క్లాస్‌‌‌‌లు స్టార్ట్​చేస్తే  స్టూడెంట్స్‌‌‌‌ను ఎక్కడ కూర్చోబెట్టి పాఠాలు చెప్పాలో తెలియని పరిస్థితి.  బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం స్టార్ట్​చేసి ఏడాది అవుతున్నా  స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. 50 శాతం వరకు పనులు పూర్తయినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.  మరో రెండు నెలల్లో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉండగా భూపాలపల్లి మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ భవితవ్యం అయోమయంలో పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆఫీసర్లు ఏం చేయాలో తెలియక దిక్కు తెలియని స్థితిలో పడిపోయారు. 

ఏడాది కింద బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులు షురూ..

జాతీయ వైద్య కమిషన్ రూల్స్​ ప్రకారం మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ  కోసం సిబ్బంది, బిల్డింగ్, పరికరాలు,  హాస్పిటల్​సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. భూపాలపల్లి జిల్లాలో మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మే 9, 2022న జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.41 కోట్లతో 250 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం చేపట్టారు. అయితే ఇదే బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌లు నిర్వహించాలని వైద్య శాఖ ఆఫీసర్లు నిర్ణయించారు. ఇప్పటికే కట్టిన 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌తో పాటు సింగరేణి హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌ విద్యార్థులు వైద్య సేవలందించేందుకు  ఏర్పాట్లు చేశారు. మరోవైపు జీ ప్లస్‌‌‌‌‌‌‌‌ టూ పద్ధతిలో కడుతున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికీ జీ ప్లస్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ స్లాబులు మాత్రమే వేశారు. మరో స్లాబ్‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉంది. అలాగే గోడలు నిర్మించాల్సి ఉంది. 

ఇప్పటివరకు ముగ్గురినే నియమించారు 

వరంగల్ కాళోజీ హెల్త్​యూనివర్సిటీ ఆధ్వర్యంలో భూపాలపల్లి కొత్త మెడికల్​కాలేజీని 100 సీట్లతో 2023–24 అకడమిక్​ఇయర్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించేందుకు ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఈ నెల 6న ఆదేశాలు జారీ చేసింది. మెడికల్​కాలేజీ నిర్వహణకు  300 మంది ఉద్యోగులు అవసరం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కేవలం ముగ్గురినే నియమించింది. వీరిలో కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ లాంగ్‌‌‌‌‌‌‌‌ లీవ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ నిబంధనల ప్రకారం  మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాలు, బోధనా ఫ్యాకల్టీ, రెసిడెంట్ డాక్టర్లను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది. 

ఎవరిని అడిగినా ఏమీ తెలియదట!

వచ్చే అకడమిక్ ​ఇయర్ ​నుంచి మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ అడ్మిషన్స్‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రావడంతో క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారో తెలుసుకునేందుకు 'వీ6 వెలుగు' ప్రయత్నం చేసింది. హాస్పిటల్​కోసం నిర్మిస్తున్న బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లోనే క్లాస్‌‌‌‌లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయనున్నారని సమాచారం. అయితే ఆ బిల్డింగ్​లో 50శాతం పైగా పనులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. క్లాస్‌‌‌‌ల నిర్వహణపై వైద్య ఆరోగ్య, వైద్య విధాన పరిషత్​ఆఫీసర్లను అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు.