టీ20ల్లో చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్

టీ20ల్లో చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్

టీమిండియా స్టార్  పేసర్ భువనేశ్వర్ కుమార్  మరో  కొత్త రికార్డ్ సృష్టించాడు. టీ20 ఫార్మాట్ లో  పవర్ ప్లేలో  అత్యధిక వికెట్లు తీసిన  బౌలర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆదివారం  మలాహిడే క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో  ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భువనేశ్వర్ ఈ ఘనత సాధించాడు.  అతను ఇన్నింగ్స్ ఐదవ బంతికి ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని అవుట్ చేశాడు.దీంతో  T20లో తన 34వ పవర్‌ప్లే వికెట్‌ను పూర్తి చేశాడు. ఈ వికెట్‌తో  భువనేశ్వర్ కుమార్ వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ,  న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీల 33 వికెట్లను అధిగమించాడు.  భారీ వర్షం కారణంగా టీ 20ని  12 ఓవర్లకు తగ్గించారు.  ఈ మ్యాచ్ లో  భారత్ 9.2 ఓవర్లలోనే 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్   ఒక మ్యాచ్ గెలిచి  ఆధిక్యంలోకి ఉంది.