9 బంతుల్లోనే 5 వికెట్లు.. ఇలాంటి ఆటగాడినా టీమిండియా పక్కన పెట్టింది..!

9 బంతుల్లోనే 5 వికెట్లు.. ఇలాంటి ఆటగాడినా టీమిండియా పక్కన పెట్టింది..!

వరల్డ్ కప్ 2023 టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను పక్కనపెట్టి ఎంత పెద్దతప్పు చేసిందో ఈ ఒక్క స్పెల్ చూస్తే తెలిసిపోతుంది. ఫామ్ లో భువీ అనుభవాన్ని వాడుకుకోవడానికి ఇష్టపడని టీమిండియా ఈ స్టార్ బౌలర్ ని వరల్డ్ కప్ లో కనీసం పరిగణించకుండా పక్కన పెట్టేసింది.

సాధారణంగా జట్టులో ఎంపిక కానీ ఆటగాడు బోర్డుపై లేదా సెలక్టర్లపై విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ భువనేశ్వర్ మాత్రం నా శాయశక్తులా పోరాడి జాతీయ జట్టులోకి వస్తానని చెప్పాడు. మాటకు తగ్గటుగానే సంచలన స్పెల్ తో దేశవాళీ టోర్నీలో మెరిశాడు.దేశవాళీ టోర్నీలో భాగంగా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈటోర్నీలో భువనేశ్వర్ కుమార్ తన ప్రతాపాన్ని చూయించాడు. పటిష్టమైన కర్ణాటకపై తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు.

ALSO READ :- ఇండియా కాదు భారత్ : పిల్లల పుస్తకాల్లో ఇక ఇలాగే ఉంటుంది

డెత్ ఓవర్లలో కేవలం తొమ్మిది బంతుల్లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌కు మ్యాచ్ గెలవడం అత్యంత కీలకమైన సమయంలో భువీ ఈ టాప్ స్పెల్ వేసి తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు.  కాగా.. భువీ టీమిండియా తరపున తన చివరి వన్డేను 2022 లో దక్షిణాఫ్రికాపై ఆడాడు. బుమ్రా, సిరాజ్ లాంటి బౌలర్లు టీమిండియాలో దూసుకు రావడం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. మరి భువీ వేసిన ఈ స్పెల్ ను చూసి సెలక్టర్లు జాతీయ జట్టులో అవకాశమిస్తారో లేదో చూడాలి.