కరోనాతో 20 కోట్ల మంది చనిపోయారు.. నాలుక కరుచుకున్న బిడెన్

కరోనాతో 20 కోట్ల మంది చనిపోయారు.. నాలుక కరుచుకున్న బిడెన్

న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ దూసుకెళ్తున్నారు. ఈ తరుణంలో కరోనా వైరస్ మరణాల విషయంలో డెమొక్రటిక్ అభ్యర్థి బిడెన్ నోరు జారారు. కరోనా మహమ్మారి వల్ల అమెరికాలో 20 కోట్ల మంది చనిపోయారని చెప్పి నాలుక కరుచుకున్నారు. పెన్సిల్వేనియాలో జరిగిన ఎలక్షన్ క్యాంపెయినింగ్‌‌లో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వైరస్ మరణాల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో బిడెన్ వ్యాఖ్యలపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనూ కరోనా లెక్కల విషయంలో బిడెన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘ప్రజలకు ఉపాధి లేదు. వాళ్లకు ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో కూడా తెలియడం లేదు. దేశంలో 120 మిలియన్ల మంది కరోనా బారిన పడి చనిపోయారు’ అని గత జూన్‌‌లో బిడెన్ చెప్పడం గమనార్హం.