ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌ కోసం మరోసారి బిడ్స్‌‌‌‌

ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ రిటైల్‌‌‌‌ కోసం మరోసారి బిడ్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌) ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ కంపెనీకి అప్పులిచ్చిన వారు కొత్త బిడ్స్‌‌‌‌ను ఆహ్వానించారు. కంపెనీ ఆస్తులను ఇండివిడ్యువల్‌‌‌‌గా లేదా క్లస్టర్లుగా అమ్మడానికి రెడీ అయ్యారు. రిలయన్స్‌‌‌‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్ ఏప్రిల్‌‌‌‌ మూన్ రిటైల్ వంటి కంపెనీలను ప్రాస్పెక్టివ్‌‌‌‌ బిడ్డర్లుగా ఫైనలైజ్ చేసినా, చివరికి ఫైనల్ బిడ్స్‌‌‌‌ను ఎవరూ వెయ్యలేదు.  ఈ ఏడాది ఫిబ్రవరి 20 తో తుది గడువు ముగిసింది. లెండర్లు ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్ ఆస్తులను క్లస్టర్లుగా విడదీసి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ‘రిజల్యూషన్‌‌‌‌ ప్లాన్ ప్రకారం ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ కొనడానికి ఫైనల్ బిడ్స్‌‌‌‌కు కిందటేడాది 15 చివరి తేది. ఈ డేట్‌‌‌‌ను ఈ ఏడాది జనవరి 16 వరకు ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 20 వరకు మరోసారి పొడిగించారు. అయినప్పటికీ ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌ కోసం ఎటువంటి రిజల్యూషన్ ప్లాన్‌‌‌‌ కూడా రాలేదు’ అని లెండర్లు పేర్కొన్నారు.  అర్హత ఉన్న వాళ్లు వచ్చే నెల 7 లోపు తమ ఈఓఐని సబ్మిట్ చేయాలి.