బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. రన్నరప్‌గా శ్రీహాన్

బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.. రన్నరప్‌గా శ్రీహాన్

బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ – 6 గ్రాండ్ ఫినాలే ఫలితం వెలువడింది. సింగర్ రేవంత్  ను విజేతగా హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈసందర్భంగా రేవంత్ భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్ మేట్స్, ఆడియన్స్ సహా అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. తాను గెల్చుకున్న ట్రోఫీని తన కూతురికి అంకితమిచ్చాడు. దీంతో రేవంత్ కు రూ.10 లక్షల క్యాష్ ప్రైజ్, రూ.25 లక్షలు విలువైన ప్లాట్, కొత్త కారును బహుమతిగా అందించారు. ఇక అంతకుముందు హౌస్ లోకి వెళ్లిన కింగ్ నాగార్జున తన గోల్డెన్ బాక్స్ లో రూ.40 లక్షలు తీసుకెళ్లాడు. వాటిని రేవంత్, శ్రీహాన్ లలో ఎవరైనా ఒకరు తీసుకొని బయటకు వెళ్లొచ్చని ఆఫర్ ఇచ్చారు.  అయితే శ్రీహాన్ ఈ ఆఫర్ కు అంగీకారం తెలపడంతో రేవంత్ విన్నర్ గా నిలిచాడు. ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో రేవంత్ కు రూ.10 లక్షలు దక్కుతాయి. అయితే ఓటింగ్ ప్రకారం.. రేవంత్ కంటే శ్రీహాన్ టాప్ వన్ లో ఉన్నాడని నాగార్జున అనౌన్స్ చేశారు. 

అంతకుముందు నాగార్జున ఫినాలే రౌండ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.  ఆ తర్వాత బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తమ డ్యాన్స్ లతో అదరగొట్టారు. అర్జున్ కళ్యాణ్, వాసంతి, సూర్య, ఫైమా, రాజ్, సుదీప, మరీనా, అభినయ, గీతూ రాయల్, ఆరోహి స్టెప్పులేసి అలరించారు. ఇక ఇవాళ బిగ్ బాస్ హౌస్ నుంచి రోహిత్, ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రవితేజ హౌస్ లోకి వెళ్లి హల్ చల్ చేశారు. అనంతరం కీర్తిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చేశారు.