
అమెరికాలోని సౌత్ కాలిఫోర్నియాలో ఉన్న ఓ పోలీసు ట్రైనింగ్ క్యాంపులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మరణించారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ విభాగం నిన్న శుక్రవారం ఉదయం 7:30 గంటలకు బిస్కైలుజ్ సెంటర్ అకాడమీలో ఈ తీవ్రమైన పేలుడు ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది.
సంఘటన స్థలంలో దర్యాప్తు బృందం: ఈ పేలుడులో ముగ్గురు అధికారులు మరణించారని, దర్యాప్తు బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తోందని తెలిపింది. పేలుడు జరిగిన సమయంలో మృతులు ఒక రకమైన పేలుడు పదార్థాన్ని ఉపయోగిస్తుండగా జరిగినట్లు చెబుతున్నారు.
అమెరికా అటార్నీ జనరల్ పమేలా బోండి ఇదొక భయంకరమైన సంఘటన, మా ఏజెంట్లు సంఘటన స్థలంలో ఉన్నారు దీనికి సంబంధించి మేము మరింత సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ కూడా పేలుడుపై స్పందించారు. బాంబు స్క్వాడ్ ప్రధాన కార్యాలయం కూడా బిస్కైలుజ్ సెంటర్ అకాడమీ శిక్షణా కేంద్రంలో ఉంది. లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం, ఆల్కహాల్, పొగాకు, తుపాకీలు, పేలుడు పదార్థాల బ్యూరో అలాగే LAPD బాంబ్ స్క్వాడ్ ట్రైనింగ్ సెంటరులో జరిగిన సంఘటనకు సహాయం అందిస్తున్నాయి.
ALSO READ : మసీదు ముందు ఎలుకల్ని వదులుతూ.. వ్యక్తి అరెస్ట్, 18 వారాలు నిషేధం..
బిస్కైలుజ్ సెంటర్ అకాడమీ ట్రెయినింగ్ సెంటర్ షెరీఫ్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ బాంబు స్క్వాడ్కి ప్రధాన కార్యాలయం. ఈ సంఘటన దక్షిణ కాలిఫోర్నియాలో దాదాపు 40 సంవత్సరాలలో అత్యంత ఘోరమైనది. అయితే పేలుడుకు సంబంధించి కారణలు ఇంకా వెల్లడికాలేదు, దర్యాప్తులోనే ఉంది.