అప్పుల కోసం పెద్ద క్యూ

అప్పుల కోసం పెద్ద క్యూ

ప్రతి నెలా 2కోట్ల మందికి పైగా వరుసలో జాయినైతున్నరు

డిజిటల్ అప్లికేషన్ల వైపుకే ఆసక్తి

ట్రాన్స్‌‌‌‌యూనియన్ రీసెర్చ్ వెల్లడి

ముంబై: ఇండియన్లు అప్పుల కోసం ఎగబడుతున్నారు. ప్రతి నెలా 2.2 కోట్ల మంది ఇండియన్ కన్జూమర్లు కొత్తగా అప్పుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని ట్రాన్స్‌‌‌‌యూనియన్ డేటా రివీల్ చేసింది. ఇండియాలో క్రెడిట్ ఎకానమీ పెరుగుతోందని, డిజిటల్ అప్లికేషన్ల ద్వారా అప్పులు తీసుకునే కన్జూమర్లు పెరుగుతున్నారని పేర్కొంది.  ఈ అప్లికేషన్ల ద్వారా వెనువెంటనే ఫండ్స్ యాక్సస్ లభిస్తోంది. ప్రస్తుతమున్న ప్రొసీజర్ ప్రకారం అప్పు తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. అప్పు తీసుకునే వారు ఎన్నో డాక్యుమెంట్లను, డేటాను సబ్‌‌‌‌మిట్ చేయాలి. ఐడెంటిటీని కన్‌‌‌‌ఫాం చేయాలి. వీటిలో ఏమైనా మోసాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు లెండర్లు పలు సార్లు మాన్యువల్‌‌‌‌గా వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాతే అప్పు ఇస్తారు. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ అని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ట్రాన్స్‌‌‌‌యూనియన్, ట్రాన్స్‌‌‌‌యూనియన్ సీమ్‌‌‌‌లెస్ ఆన్‌‌‌‌బోర్డింగ్ సేవలను లాంచ్ చేసింది. ఇది ఇటు లెండర్స్‌‌‌‌కు, అటు కన్జూమర్లకు డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్‌‌‌‌లో ఉపయోగపడుతోంది. కస్టమర్ లాయల్టీని పెంచి, మోసాలను తగ్గించడానికి, లెండర్స్ ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడానికి దోహదం చేస్తుంది. లెండర్స్ టైమ్‌‌‌‌ను కూడా సేవ్ చేస్తుంది. కొంతకాలంగా ఒక్క రోజులోనే అప్పు జారీ అయ్యే ప్రొడక్ట్‌‌‌‌లు పెరుగుతున్నాయని, కానీ మొత్తంగా ఆ సంఖ్య తక్కువగా ఉందని ట్రాన్స్‌‌‌‌యూనియన్ ఆసియా ప్రెసిడెంట్ సతీష్ పిళ్లై చెప్పారు. లెండర్లు పోటీ వాతావరణంలో ఉండాలని, పెరుగుతున్న కన్జూమర్ల డిమాండ్‌‌‌‌ను అందుకోవాలని సూచించారు.