Anant Ambani Wedding: అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి..మన హీరోల ముందు తేలిపోయిన బాలీవుడ్ స్టార్స్!

Anant Ambani Wedding: అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి..మన హీరోల ముందు తేలిపోయిన బాలీవుడ్ స్టార్స్!

గత మూడు రోజులుగా ముఖేశ్ అంబానీ ఇంట్లో పెండ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరుగుతున్నాయి. వరుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శుక్రవారం రాత్రి వారి ‘శుభ్‌ వివాహ్‌’జరిగింది.ఈ వేడుకకు తారా లోకం కదిలింది.

సినీ,రాజకీయ,వ్యాపార,తదితర రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో,తమదైన సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు.వీరి వివాహ వేడుక భారతదేశంలోనే(ముంబై )జరిగిన బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా, సౌత్,హాలీవుడ్ నుంచి కూడా అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకలో సెలబ్రెటీల డ్యాన్స్ లు,వారి ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే  శుక్రవారం ముంబైలో నక్షత్రాల వర్షం కురిసింది.మరి ఈ వేడుకకు ఎవరెవరు హాజరయ్యారో ఓ లుక్కేద్దాం.

అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి చూసుకుంటే..మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు రాంచరణ్,రానా దగ్గుబాటి తమ భార్యలతో హాజరయ్యారు.అలాగే విక్టరీ వెంకటేష్ కూడా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కనిపించారు.ఎవరూ ఊహించని విధంగా వేడుకలో మహేష్ చాలా రోజుల తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపించారు.బ్లాక్ సూట్ ధరించిన మహేష్ యమా స్టయిల్ గా హుందాగా ఉన్నారు.ఆయన సతీమణి నమ్రత,కుమార్తె సితార ట్రెడిషనల్ గా కనిపించారు.సితార కూడా తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకర్షించింది.

ఇక రామ్ చరణ్ వైట్ కుర్తా ఫైజామ్ ధరించి స్టైలిష్ గా కనిపించాడు.తన స్టైలిష్ యాటిట్యూడ్ తో అదిరిపోయే ఫోజులు ఇచ్చాడు.ఉపాసన స్కె బ్లూ కలర్ శారీలో ట్రెడిషనల్ గా మెరిశారు. అలాగే వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి కూడా తన సతీమణి మిహీక బజాజ్ తో కలసి తెగ సందడి చేశాడు.రానా వైట్ డ్రెస్ ధరించగా,మిహీక రెడ్ లెహంగాలో కలర్ ఫుల్ గా కనిపించారు.బాహుబలితో,ఘాజి వంటి సినిమాలతో రానా నార్త్ లోమంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక విక్టరీ వెంకీ మామ మాత్రం సోలోగా అంబానీ వెడ్డింగ్ లో సందడి చేశారు.వెంకీ సింపుల్ గా కనిపిస్తూనే తనదైన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. అఖిల్, రష్మిక మందన్న మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.ఏది ఏమైనా అంబానీ పెళ్లి వేడుకలో టాలీవుడ్ హీరోల ముందు బాలీవుడ్ హీరోలు తేలిపోయారు. 

ఇకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్ ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,షారుఖ్ ఖాన్,రణవీర్ సింగ్,అనిల్ కపూర్,సూర్య జ్యోతిక,యష్,సల్మాన్‌ ఖాన్‌,విక్కీ కౌశల్‌ మరియు క్రికెట్ గాడ్ సచిన్,ధోని తదితరులు అటెండ్ అయ్యారు.ఇక ఈ వేడుకలో స్టార్ హీరోయిన్ నయనతార రెడ్ కార్పెట్ మీద దిగి,తన ఫిల్మ్ మేకర్ భర్త విఘ్నేష్ శివన్‌తో ఫోజులిచ్చింది.గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా,తన భర్త నిక్ జోనస్ తో సందడి చేసింది.పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కూడా తన సతీమణితో సందడి చేశారు. 

రజినీకాంత్ తో పాటు తన భార్య లత,కూతురుగు ఐశ్వర్య,మనవడితో కలిసి వెళ్లారు.అయితే,ఈ ఈవెంట్ లో రజినీ తనదైన స్టెప్పులతో  డ్యాన్స్ అదరగొట్టేసారు.రజినీకాంత్ డ్యాన్స్ చేస్తుంటే అనంత్ అంబానీ,అనిల్ కపూర్,రణవీర్ సింగ్..అక్కడ ఉన్న పలువురితో కలిసి డ్యాన్స్ వేశారు.స్టార్ హీరోయిన్ మాధురీదీక్షిత్‌ చోళీ కే పీచే పాటకు డ్యాన్స్‌ చేశారు.ఇవాళ జరగనున్న శుభ్‌ ఆశీర్వాద్‌కు అతిథులంతా ఫార్మల్‌ దుస్తుల్లో రానున్నారు.రేపు రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకలన్నీ బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లోనే జరుగుతున్నాయి.