
కరోనా మహమ్మారీ మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పటికే పలు దేశాలలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా బాలీవుడ్ నటి, మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్నీ స్వయంగా శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
"హలో ప్రజలారా! నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. సురక్షితంగా ఉండండి మరియు మీ మాస్క్‌లు ధరించండి" అని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ద్వారా చెప్పింది. ఆమె సోదరి మహేష్ బాబు భార్య నమ్రత, నటి సోనాక్షి సిన్హా తదితరులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఇటీవలే హిందీ బిగ్ బాస్ 18 షోలోకి అడుగుపెట్టింది. ఆ షోలో తన ఆట తీరుతో టాప్ 5లో నిలిచి మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులు, ఎండార్స్‌మెంట్‌లు మరియు ఫోటోషూట్‌లతో యాక్టీవ్ గా ఉంటుంది.
సింగపూర్ లో ఈ ఏడాది ఇప్పటికే 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇది గత ఏడాది కంటే 28 శాతం అధికమని తెలుస్తోంది. సింగపూర్ సహా..చైనా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏసియాలో వేగంగా వ్యాపిస్తోంది కరోనా ఆయా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.
చైనాలో గత సంవత్సరం వేసవి కాలంతో పోల్చితే.. ఈ ఏడాది నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో జరిగిన సాంగ్ క్రాన్ ఫెస్టివల్ తర్వాత థాయిలాండ్ లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో జనాల్లో లాక్ డౌన్ భయం మళ్ళీ మొదలైంది.