
బిగ్ బాస్ 4లో ఐదో వారం కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అందులో కొందరు స్ట్రాంగ్ రీజన్స్ చెప్పి బయటికి పంపడానికి నామినేట్ చేసారు. మరికొందరు మాత్రం చాలా అంటే చాలా సిల్లీ కారణాలు చెప్పారు. ఎంతగా అంటే విని నవ్వుకునేంత కారణాలు చెప్పారు. ఎలిమినేట్ చేయడానికి బలమైన కారణాలు ఉండాలంటూ బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం వాటిని లైట్ తీసుకుంటున్నారు. అనవసరంగా నామినేట్ చేస్తున్నారు. అసలు ఇది ఓ కారణం.. ఇలాంటి కారణంతో కూడా నామినేట్ చేయొచ్చా అనేది కూడా అర్థం కావడం లేదు. అలాంటి సిల్లీ రీజన్స్ ఇద్దరు చెప్పారు ఇంట్లో. ఒకరు దివి.. మరొకరు సుజాత. లాస్యను నామినేట్ చేయడానికి దివి చెప్పిన కారణం బహుశా బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరూ చెప్పేలేదేమో..? ఎందుకంటే లాస్య చేసిన పప్పు తిని ఇంట్లో అందరికీ మోషన్స్ అవుతున్నాయని దివి ఆమెను నామినేట్ చేసింది.
ఇది విన్న తర్వాత ఒక్కసారిగా లాస్య అరిచేసింది. తన పప్పు తిని అందరికీ మోషన్స్ అవుతున్నాయని నువ్వెలా చెప్తావ్.. దానికి నేను ఒప్పుకోను అంటూ సీరియస్ అయింది. దీనిపై గంగవ్వ కూడా సీరియస్ అయ్యింది. లాస్య వండితే తిని ఇప్పుడు పప్పు బాగాలేదంటావా అని దివిపై సీరియస్ అయ్యింది గంగవ్వ. అసలు ఇది ఓ కారణం.. ఇలాంటి కారణంతో కూడా నామినేట్ చేస్తారా అంటూ దివిపై ట్రోలింగ్ జరుగుతుంది.
ఇక మరికొంత మంది దివికి సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కిచెన్ క్లీన్ ఉంచడం లేదంటూ, పాత్రలు కడగమంటే ఆ పని చేయనని చెప్పిదంటూ దివిని లాస్య నామినేట్ చేసింది. లాస్య చెప్పిన రీజన్ కూడా బలమైంది కాదని, అందుకే దివి అలాంటి రీజన్ చెప్పిందని, చెల్లుకు చెల్లు అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాగా, ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు ఉన్నారు.
Frankly Speaking, Pappu reason is the dumbest reason ever in out of 4 Biggboss Seasons
Feeling pity for Lasya
That’s my opinion#BiggBossTelugu4 #BiggBoss4Telugu #Divi
— Realilty Matters (@bb4telugu_tweet) October 6, 2020