Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్‌లో 'డిక్టేటర్' తనూజ ఆగం.. సుమన్‌కు మొండిచేయి.. రీతూకి కెప్టెన్సీ పట్టం!

Bigg Boss Telugu 9: కెప్టెన్సీ టాస్క్‌లో 'డిక్టేటర్' తనూజ ఆగం.. సుమన్‌కు మొండిచేయి.. రీతూకి కెప్టెన్సీ పట్టం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా క్లైమాక్స్‌కు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీంతో చివరికి విన్ ఎరరనేది ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వారం  మొత్తం హౌస్‌లోఎమోషనల్ అట్మాస్పియర్ నెలకొంది.  'ఫ్యామిలీ వీక్' ప్రేక్షకుల  హృదయాలను కరిగించేసింది. కానీ హౌస్‌మేట్స్ మధ్య 'కెప్టెన్సీ' కోసం కంటెస్టెంట్ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. 11వ వారం కెప్టెన్ ఎవరో ఇప్పటికే లీక్‌లు బయటికి వచ్చినప్పటికీ.. బుల్లితెరపై మాత్రం అంతకుమించిన డ్రామా నడుస్తోంది. కెప్టెన్సీ టాస్క్‌లో దివ్య, తనూజ మధ్య మాటల యుద్ధం జరగడం, ఆ తర్వాత సుమన్ కెప్టెన్సీ దక్కించుకునే క్రమంలో జరిగిన అనూహ్య పరిణామాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచాయి.

కెప్టెన్సీ టాస్క్

ఈ  రోజు కెప్టెన్సీగా ఎవరు ఉండబోతున్నారో అన్న ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచింది. కెప్టెన్సీ టాస్క్‌లో సుమన్, రీతూ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. సుమన్ అద్భుతమైన వేగంతో టాస్క్‌ను పూర్తి చేయడంలో ముందున్నాడు. చివరి దశలో, ఒక బోర్డును సెట్ చేయాల్సి ఉండగా, సంచాలక్‌గా వ్యవహరిస్తున్న తనూజ పుట్టస్వామి, సుమన్ పని పూర్తయిందని నిర్ధారించి,.. పర్లేదు, వెళ్లు అంటూ అతన్ని పంపించేసింది. దాంతో, సుమన్ వెంటనే కెప్టెన్ అని రాసున్న జెండాను ఎగరేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల తేడాతో రీతూ కూడా తన జెండాను ఎగరేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

 'డిక్టేటర్' తనూజ తీర్పు

సుమన్ గెలిచాడనుకున్న సమయంలో.. డెమోన్ పవన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుమన్ చివరి బోర్డును సరిగా పెట్టలేదని, టాస్క్ నియమాల ప్రకారం అది సరిగా సెట్ కాలేదని పవన్ వాదించాడు. అక్కడే దగ్గరుండి ఆ లోపాన్ని చూపించాడు. అయితే, సంచాలక్ తనూజ తీరు పూర్తిగా పక్షపాతంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో, పవన్ వాదనను పట్టించుకోకుండా.. వాళ్లిద్దరు ఫైట్ చేసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్‌.. నువ్వేంటి చెప్పేది? అంటూ పవన్‌ను తీసిపడేసింది. ఈ సమయంలోనే కల్యాణ్ జోక్యం చేసుకుని.. నువ్వు డిక్లేర్ చేశాకే సుమన్ చివరి బోర్డును వదిలేశాడు అని వాదించాడు. దాంతో తనూజ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

►ALSO READ | Ramanaidu Studios: జీహెచ్‌ఎంసీ నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్‌... ట్యాక్స్ ఎగవేతపై ఏమ్మన్నారంటే?

 రీతూకి కెప్టెన్సీ!

కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా తనూజ తీసుకున్న తొందరపాటు, సరైన పరిశీలన లేని నిర్ణయం కారణంగా సుమన్ కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. చివరికి, టాస్క్ నియమాలు, జరిగిన వాదనల అనంతరం రీతూ కెప్టెన్‌గా ప్రకటించబడినట్లు సమాచారం. ఈ పరిణామం హౌస్‌మేట్స్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా సంచాలక్‌గా తనూజ తీసుకున్న ఈ నిర్ణయం, హౌస్‌లో ఆమె ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్ ముంగిట, కెప్టెన్సీ చుట్టూ అల్లుకున్న ఈ డ్రామా హౌస్‌లో కొత్త గ్రూపులను, వైరాన్ని పెంచేలా కనిపిస్తోంది.