Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని షాక్! వైల్డ్ కార్డ్ ఎంట్రీ రమ్య మోక్ష ఔట్?

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని షాక్!  వైల్డ్ కార్డ్ ఎంట్రీ రమ్య మోక్ష ఔట్?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఏడో వారంలో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో..  ప్రేక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్ల ఓటింగ్ ట్రెండ్‌లను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వారం హౌస్‌మేట్స్‌కు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. గత వారం భరణి అనూహ్యంగా ఎలిమినేట్ కాగా, ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన రమ్య మోక్ష ను ఇంటి నుంచి బయటకు పంపినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ఓటింగ్ ట్రెండ్స్‌లో సంచలనం

ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో సంజన గల్రానీ, రీతూ చౌదరి, తనుజ, కళ్యాణ్ పడాల, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, రమ్య మోక్ష, దివ్య నిఖిత పోటీ పడుతున్నారు. అనధికారిక ఓటింగ్ పోల్స్ ప్రకారం, కొందరు కంటెస్టెంట్లు సేఫ్ జోన్‌లో ఉండగా, మరికొందరు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ సరళిలో నాటకీయ మార్పులు కనిపిస్తున్నాయి. 

గత కొన్ని వారాలుగా స్థిరమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న తనుజ భారీ ఆధిక్యంతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆమెకు గట్టి పోటీ ఇస్తూ కళ్యాణ్ పడాల రెండో స్థానంలో నిలిచాడు. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్, ఆటతీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇక దివ్య నిఖిత బలమైన ఓట్లతో మూడో స్థానంలో స్థిరంగా ఉంది. సంజన గల్రానీ, రాము రాథోడ్ వంటివారు మధ్యస్థంగా కొనసాగుతున్నారు.

రమ్య మోక్షకు నెగిటివిటీ ఎఫెక్ట్..

డేంజర్ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష ఉన్నారు. ముఖ్యంగా 'పచ్చళ్ల పాప'గా హౌస్‌లోకి అడుగుపెట్టిన రమ్య మోక్ష, వైల్డ్ కార్డ్‌గా వచ్చిన అతి తక్కువ సమయంలోనే నెగిటివిటీని మూటకట్టుకుంది. ఆమె నోటి దురుసు, పర్సనల్ ఎటాక్‌లు, కళ్యాణ్-తనుజ రిలేషన్‌పై పదేపదే చేసిన కామెంట్స్ ప్రేక్షకులకు రుచించలేదు. హౌస్‌లో బాండింగ్‌లను విమర్శించిన ఆమె, వారం తిరగకుండానే తోటి కంటెస్టెంట్ల నుంచి బాండింగ్ కోసం ఆరాటపడటం ఆమెను మరింత మైనస్ చేసింది.

►ALSO READ | Rashmika Mandanna: నా హృదయం ముక్కలైంది.. కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..!

దీంతో, రమ్య మోక్ష హౌస్ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్న ప్రేక్షకులు, ఆమెకు వ్యతిరేకంగా ఓట్లను పోల్ చేయడం జరిగింది. అనధికారిక ఓటింగ్ ప్రకారం, రమ్య మోక్షకే అత్యంత తక్కువ ఓట్లు నమోదు అయినట్లు సమాచారం. ఈ ఏడవ వారం ఎలిమినేషన్ ఆమెకే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయిన ఆయేషా అనారోగ్యంతో తాత్కాలికంగా హౌస్ నుంచి బయటకు వెళ్లడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండదని అంతా భావించారు. కానీ, నిర్వాహకులు ఎలిమినేషన్‌ను కొనసాగించి, రమ్య మోక్షను బయటకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఇది మొదటి ఎలిమినేషన్ కావడం, కేవలం రెండు వారాలకే రమ్య జర్నీ ముగియడం ఈ వారం హైలైట్. అయితే, ఓటింగ్ లైన్లు ఆఖరి క్షణంలో ఈ ట్రెండ్‌లు మారే అవకాశం ఉంది. అసలు విషయం వీకెండ్ ఎపిసోడ్‌లోనే తేలనుంది.