Rashmika Mandanna: నా హృదయం ముక్కలైంది.. కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..!

Rashmika Mandanna: నా హృదయం ముక్కలైంది.. కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక ఎమోషనల్ పోస్ట్..!

కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై సినీ నటి రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 'ఈ వార్త విని నా హృదయం ముక్కలైంది. ఎంతో బాధ పడ్డాను. మంటల్లో చిక్కుకున్న ప్రయా ణికుల బాధ ఊహించడానికే భయంకరంగా ఉంది. ఇందులో చిన్న పిల్లల తో సహా ఒక ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్న' అంటూ రష్మిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

 

ఇక సినిమాల విషయానికొస్తే.. వరుస మూవీలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు... 'థామా' హిట్ సక్సెస్ ను ఆస్వాదిస్తోంది. ఈ చిత్రం బాక్సా ఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక రష్మిక నవంబర్ 7న విడుదల కానున్న 'ది గర్ల్ ఫ్రెండ్' ప్రమోషన్ లో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఈ అమ్మడు టైటిల్ రోల్ లో నటించింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది..

►ALSO READ | 'బిగ్ బాస్' దివ్య మెడకు హిట్ అండ్ రన్ కేసు.. కీలకంగా సీసీటీవీ ఫుటేజ్.. అసలేం జరిగిందంటే?

యూత్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌ రొమాంటిక్‌‌ లవ్‌‌‌‌‌‌‌ స్టోరీగా రూపుద్దిద్దుకుంటున్న ఈ మూవీలో రష్మిక, దీక్షత్ శెట్టి జంటగా కలిసి నటించారు.  హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.  హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.  పాన్ ఇండియా స్థాయిలో  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.