Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9: తొలి వారం ఎలిమినేషన్‌కు లైన్ క్లియర్.. ఆ కంటెస్టెంట్‌కే బిగ్ గండం?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9: తొలి వారం ఎలిమినేషన్‌కు లైన్ క్లియర్.. ఆ కంటెస్టెంట్‌కే బిగ్ గండం?

ఎంతో ఆట్టహాసంగా సెప్టెంబర్ 7న ప్రారంభమైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' మొదటి వారం( సెప్టెంబర్ 13వ తేదీ)  పూర్తి చేసుకుంది. ఈసారి 'చదరంగం కాదు.. రణరంగం' అనే కొత్త ఫార్మాట్‌తో మొదలైన ఈ రియాలిటీ షో తొలి రోజు నుంచే రసవత్తరంగా మారింది. హౌస్‌లో తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు పోటీ పడుతున్నారు. సెలబ్రిటీలను 'టెనెంట్స్'గా, కామనర్లను 'ఓనర్లు'గా బిగ్ బాస్ డిసైడ్ చేయడంతో మొదటి రోజు నుంచే గొడవలు, వాగ్వాదాలు మొదలయ్యాయి.  హౌస్ ను రణరంగంగా మార్చి హీటెక్కించారు.ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి ఎవరు బయటపడతారు, ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

నాగార్జున పంచులు.. కంటెస్టెంట్లకు చురకలు

బిగ్ బాస్ హౌస్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఒకరిని బయటకు పంపించే తరుణం ఆసన్నమైంది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. వారిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ 9లో తొలి వారం విజయవంతంగా పూర్తవడంతో శనివారం హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్‌మేట్స్ ముందుకు వచ్చేశారు.  ఎంట్రీ సాంగ్ తో అదరగొట్టిన కింగ్.. ఒకవైపు అందరినీ సరదాగా నవ్విస్తూనే, మరోవైపు తనదైన స్టైల్‌లో చురకలు అంటించారు. కెప్టెన్ సంజనకు కాస్త గట్టిగానే పంచులు పడ్డాయి. దీనికి సంబంధించిన ప్రోమోను లేటెస్ట్ గా విడుదల చేశారు.

ఫ్లోరా - సంజన మధ్య రచ్చ..

వీకెండ్ ఎపిసోడ్‌లో ఏమి జరుగుతుందా అనే కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో ఉంది. మొదటి రోజు నుంచే ఇంటిలో రచ్చ చేసిన కంటెస్టెంట్లను నాగార్జున ఎలా ఎదుర్కొంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వస్తూనే, నాగార్జున రాము రాథోడ్ బట్టలు ఉతకడం గురించి, ఇమ్మాన్యుయేల్.. హరీశ్‌ని 'గుండంకుల్' అని పిలవడం గురించి సరదాగా పంచులు వేశారు. ఆ తర్వాత, సంజన, ఫ్లోరాల మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడారు.

►ALSO READ | Manchu Manoj: నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు.. మనోజ్ ఎమోషనల్

ఒకరి రిలేషన్ గురించి రాము రాథోడ్ చెబుతుంటే మధ్యలో వచ్చిన సంజన.. ఫ్లోరాను 'ఫ్రీ బర్డ్' అనడం అస్సలు నచ్చలేదని ఫ్లోరా నాగార్జునతో కంప్లైంట్ చేసింది. తాను మాట్లాడుతున్నప్పుడు సంజన మధ్యలో జోక్యం చేసుకోవడం సరైనది కాదని ఫ్లోరా వాదించింది. అయితే సంజన మాత్రం 'ప్రపంచంలో ఎక్కడైనా సరే 'ఫ్రీ బర్డ్' అనడం తప్పెలా అవుతుంది?' అని ఎదురు ప్రశ్నించింది.

కెప్టెన్‌పై ప్రశ్నల వర్షం

కెప్టెన్ అయిన తర్వాత సంజన.. ఫ్లోరాకు కాఫీ ఇవ్వకూడదని హౌస్‌మేట్స్‌తో చెప్పిందని ఫ్లోరా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కాఫీ టాపిక్కే రాలేదని సంజన చెప్పింది కానీ, మిగతా టీమ్ మేట్స్ మాత్రం సంజన అలానే అనిందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో నాగార్జున మరింత గట్టిగా అడిగారు. "బిగ్ బాస్ ఏదీ ఇవ్వకూడదని మిమ్మల్ని మందలించినప్పుడు, మీరు రాముకి టీ ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశారు?" అని సంజనను సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సంజన ఎలా సమాధానం ఇస్తుందో, తాను కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాలను ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.

ఎలిమినేషన్ గండం

ఇక ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి ఎవరు బయటపడతారు, ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.. సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఇమ్మాన్యుయేల్ వంటి వారికి మంచి ఓట్లు పడుతున్నట్లు సోషల్ మీడియా పోల్స్ చెబుతున్నాయి. అయితే, తొలి వారం ఆటలో పెద్దగా కనిపించని ఫ్లోరా సైనీకి ఎలిమినేషన్ గండం పొంచి ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద, ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ ఉత్కంఠగా, ఆసక్తికరంగా సాగుతుందని భావిస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున మరిన్ని పదునైన ప్రశ్నలు అడిగి, ఎవర్ని ఎలిమినేట్ చేస్తారనేది వేచి చూడాలి!