దివి కొత్త అందాలు చూసారో..కుర్రాళ్లు..ఇక అంతే!

దివి కొత్త అందాలు చూసారో..కుర్రాళ్లు..ఇక అంతే!

బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన బ్యూటీ దివి( Divi). బిగ్బాస్ కంటే ముందు పలు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. బిగ్బాస్ తో మాత్రం మంచి ఫేమ్ సంపాందించుకుంది.

సీజన్ 4లో కంటెస్టెంట్గా పాల్గొని తన ఆట తీరుతోపాటు అందం, అభినయంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక.. అందరిలానే ఆమె కూడా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. వరుస ఆఫర్లు అందుకుంది. వెబ్ సిరీస్ లతోపాటు సినిమాలూ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. దాంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటోంది.

ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను షేర్ చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో  కొత్త ఫొటోలను షేర్ చేసింది ఈ అమ్మడు. టైట్ ఫిట్ పొట్టి బ్లాక్ డ్రెస్లో ఫొటోలకు ఫోజులిచ్చింది. నాకు మెరిసే నక్షత్రం అవసరం లేదు..మరియు నేను రక్షించబడాలని కోరుకోవడం లేదు అంటూ ట్యాగ్ చేసింది. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 

కెరీర్ స్టార్టింగ్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన దివి బిగ్బాస్తో ఒక్కసారిగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుందీ అమ్మడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divi Vadthya (@actordivi)