తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ దివి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  బిగ్ బాస్ దివి

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ దివి వాధ్యా, సినీ‌ నటుడు అశోక్ సెల్వన్ లు వేర్వేరుగా స్వామివారి సేవలో‌ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పొందారు. ఆలయ అధికారులు వారిని పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దివి వాధ్యా అన్నారు. మొక్కు ఉన్నందున కాలినడక తిరుమలకు చేరుకుని.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. దేవుడి ఆశీస్సులతో ప్రస్తుతం 3 సినిమాలు, వెబ్ సిరిస్ లలో నటిస్తున్నానని, కొత్త సినిమా ఆఫర్లు అవకాశాలు వస్తున్నాయని దివి చెప్పారు. అనంతరం నటుడు అశోక్ సెల్వన్ మాట్లాడుతూ.. ఆకాశం అనే చిత్రం నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, ఆ మూవీ విజయం సాధించాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.