పారిపోయిన అంతరాష్ట్ర దొంగ.. మల్లెపూల నాగిరెడ్డి దొరికాడు

పారిపోయిన అంతరాష్ట్ర దొంగ.. మల్లెపూల నాగిరెడ్డి దొరికాడు

హైదరాబాద్: అంతర్రాష్ట్ర దొంగ తెలుగు  నాగిరెడ్డి అలియాస్ మల్లెపూల నాగిరెడ్డిని  ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం( జనవరి6)  అర్థరాత్రి హైదరాబాద్ లో నాగిరెడ్డిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన నాగిరెడ్డి.. కల్వకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. నాగిరెడ్డి పరారీతో ఎస్ ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డుపై వేటు పడింది.  

నవంబర్13న ఓ దొంగతనం కేసులో నాగిరెడ్డిని కల్వకుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో భాగంగా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో ఉంచగా.. వాష్ రూం పేరుతో స్టేషన్ బాత్రూం నుంచి పరారయ్యాడు. నాగిరెడ్డి పరారీతో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లపై సస్పెన్షన్ వేటుపడింది. ఎస్ ఐ కీ ఛార్జ్ మెమో, హోంగార్డుపై చర్యలు తీసుకున్నారు. 

ఏపీలో నంద్యాల జిల్లాకు చెందిన  అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి చిన్నప్పటినుంచే జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడు. నాగిరెడ్డిపై వందకు పైగా దొంగతనం కేసులున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగిరెడ్డిపై మొత్తం 100 పైగా కేసులు నమోదు అయ్యాయి.