
బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) ఏ ముహూర్తాన మొదలయిందో తెలియదు కానీ.. ఈ సీజన్ లో జరిగినన్ని గొడవలు ఏ సీజన్లో జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న చిన్న కారణాలతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కంటెస్టెంట్స్. ఇక అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, శివాజీ,యావర్,శోభా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నామినేషన్స్ డే వచ్చిందంటే చాలు.. మాటల యుద్ధం మొదలుపెడుతున్నారు.
ఇక కంటెస్టెంట్స్ డి ఒకరకమైన గొడవైతే.. వాళ్ళ ఫ్యాన్స్ డి మరో గొడవ. తన అభిమాన కంటెస్టెంట్స్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకి బ్యాడ్ కామెంట్స్ పడుతూ చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే కుటుంబ సభ్యుల గురించి చాలా నీచంగా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఇలాంటి సంఘటనే బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ కు ఎదురయ్యింది. కారణం ఆమె అమర్ దీప్ కు కాకుండా.. ఇటీవల ఇంటినుండి ఎలిమినేట్ అయినా గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేయడమే. దేంతో అమర్ దీప్ ఫ్యాన్స్ ఆమెకు బ్యాడ్ కామెంట్స్ పెడుతూ టార్గెట్ చేస్తున్నారని బాధపడుతూ వీడియో రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను ఈ మధ్య బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్ కు వెళ్లాను. అప్పటినుండి నాకు చాలా బ్యాడ్ మెసేజ్ లు వస్తున్నాయి. ఇటీవల నేను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎవ్వరిపైనా నెగిటీవ్ గా మాట్లాడలేదు కానీ.. అమర్ దీప్ ఫ్యాన్స్ మాత్రం నోటికి వచ్చినట్లు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇళ్లల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. నిజంగా నా తప్పుంటే మీ కాళ్లు మెుక్కుతా. తప్పు లేదంటే మాత్రం.. నడి రోడ్డుపై కొడతా. అమ్మాయిలను కాస్త గౌరవించడం నేర్చుకోండి.
నాపై మీరు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే చాలా బాధేస్తోంది. నచ్చిన వారికి సపోర్ట్ చేస్తే అందులో తప్పేముంది. నన్ను వదిలేయండి ప్లీజ్.. అంటూ ఎమోషనల్ వీడియో చేశారు కీర్తి భట్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం కీర్తికి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో.. అందులోకి పర్సనల్ లైఫ్ ను లాగకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.