
బిగ్‌బాస్ ఫేమ్, నటుడు మానస్(Manas) ఓ ఇంటివాడయ్యారు. చెన్నైకి చెందిన శ్రీజ(Srija) అనే అమ్మాయితో మానస్ వివాహం ఘనంగా జరిగింది. విజయవాడలోని ఓ రిసార్ట్స్ లో వేడుకగా జరిగిన ఈ పెళ్లికి.. ఇరు కుటుంబసభ్యులతో పాటు పలువురు నటీనటులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన మానస్ అభిమానులు, నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక మానస్ విషయానికి వస్తే.. కోయిలమ్మ సీరియల్ ద్వారా ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మానస్. ఆ తర్వాత కూడా పలు సీరియల్స్‌లో నటించిన మానస్.. ఆ ఫేమ్ తోనే బిగ్‌బాస్ సీజన్ -5లో ఎంట్రీ ఇచ్చాడు. తన ఆటతో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న మానస్ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్నాడు.