Punarnavi: పునర్నవికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది

Punarnavi: పునర్నవికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఫొటోతో క్లారిటీ ఇచ్చేసింది

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి(Punarnavi) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాటిసిపేట్ చేసిన ఈ చిన్నది తన అందంతో ఆడియన్స్ ని కట్టిపడేసింది. అంతేకాదు.. సింగర్ రాహుల్ షిఫ్లిగంజ్ తో ఆమె స్నేహం కూడా చాలా మందికి  నచ్చింది. అందుకే చాలా వారాలపాటు ఆమె హౌస్ లో కొనసాగింది. ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పునర్నవి భూపాళం చాలా  కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నా అంతగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేదు. 

కనీసం బిగ్ బాస్ తరువాత అయినా మంచి అవకాశాలు వస్తాయి అనుకుంటే.. అది కూడా పెద్దగా వర్కౌట్ అవలేదు. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఆమె కేవలం కమిట్మెంటల్ ఒక్క వెబ్ సిరీస్ మాత్రమే చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఒక  ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో పునర్నవితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. కొండల మధ్య ఇద్దరు మాత్రమే మొహాలు కనబడకుండా ఉంది ఆ ఫోటో.

అంతేకాదు.. ఆ ఫోటోకి హ్యాపీ బిర్త్ డే తో ది వన్ అండ్ ఓన్లీ.. అని రాసి చివర్లో లవ్ సింబల్ ని యాడ్ చేసింది. దీంతో.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో పునర్నవితో ఉన్నడి ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్స్ పునర్నవి సింగల్ కాదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పిన్ను షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ పై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్స్ చేయండి.