
బాలీవుడ్ బ్యూటీ కృతి వర్మ(Kriti verma)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఆమె దాదాపు రూ.263 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిందని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. ఈ ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఇక కృతి వర్మ బిగ్ బాస్ సీజన్ 12లో పాల్గొని నటిగా మారిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆమె ఆదాయపు పన్ను అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో కృతి వర్మ తన పై అధికారులకు తెలియకుండా వారి అధికారిక లాగిన్‌లను ఉపయోగించి రూ.264 కోట్లమేర మోసాలకు పాల్పడిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
ఇంకా ఈ కేసులో కృతి వర్మతో పాటు.. ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ పాటిల్‌ను కూడా కీలక నిందితుడిగా గుర్తించారు అధికారులు. ఈ కేసులో పెద్ద మొత్తంలో నిధులు భూషణ్ పాటిల్ ఖాతాకు చేరాయని, అందులో కొంత భాగంతో వర్మ పేరుపై ఆస్తులను కొనుగోలు చేశారని విచారణలో తేలింది.
మొత్తం 12 మోసపూరిత టీడీఎస్ రీఫండ్‌ల కింద దాదాపు రూ. 263.95 కోట్ల సొమ్ము అక్రమంగా తరలించబడిందని పీఎమ్‌ఎల్‌ఏ కింద జరిగిన దర్యాప్తులో వెల్లడైంది. వాటిలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో రూ.69.65 కోట్లతో కొనుగోలు చేసిన 32 స్థిరా, చరాస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది.