Elvish yadav: పోలీసుల అదుపులో బిగ్ బాస్ OTT విన్నర్

Elvish yadav: పోలీసుల అదుపులో బిగ్ బాస్ OTT విన్నర్

హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్‌(Elvish Yadav)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద యూట్యూబర్ పేరుతెచ్చుకున్న ఎల్విష్ హిందీ బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టి తన ఆటతీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకొని విజేతగా నిలిచాడు. అతడిని తాజాగా నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాము విషం కేసులో ఎల్విన్ ను అదుపులోకి తీసుకున్నట్లు నోయిడా డీసీపీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గతేడాది గురుగ్రామ్, నోయిడాలోని రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేస్తున్నట్లు ఎల్విష్‌ పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు.. ఎల్విష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మాత్రం తీవ్రంగా ఖండించాడు ఎల్వీశ్ యాదవ్. అంతేకాదు.. ఈ కేసులో గనక తాను దోషిగా రుజువైతే కెమెరాల ముందు బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎల్విష్ ను కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.