డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

డేంజర్ జోన్లో ఆ ఇద్దరు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో ఎనిమిదవ ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమయ్యింది. ఈ వారం నామినేషన్స్ లో.. శివాజీ(Shivaji), అమర్ దీప్(Amar deep), శోభా శెట్టి(Shobha shetty), ప్రియాంక(Priyanaka), అశ్విని(Ashwini), భోలే(Bhole), గౌతమ్(Goutham), సందీప్(Sandeep) ఉన్నారు. ఈవారం దాదాపు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వారు నామినేషన్స్ లో నిలిచారు. దీంతో ఈవారం ఇంటినుండి ఎవరు బయటకు వస్తారు, ఆడియన్స్ ఎవరిని ఎలిమినేట్ చేయనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. 

ఇక ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. ఎప్పటిలాగే శివాజీ 40% ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతున్నారు. ఇలా ఒక కంటెస్టెంట్ కు ఈ రేంజ్ ఓటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఓటింగ్ చేస్తుంటే అరతమవుతోంది. జనాల్లో శివాజీకి ఏ రేంజ్ లో సపోర్ట్ ఉండే. ఇక రెండవ స్థానంలో భోలే ఉన్నాడు. గతవారం ఎలిమినేట్ అవుతారు అనుకున్న భోలే ఈవారం టాప్ 2 లోకి రావడం అనేది ఊహించని పరిణామం. ఇది కేవలం సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేయడం వల్లనే జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మా టీవీ బ్యాచ్ భోలేను టార్గెట్ చేయడం వల్ల జనాల్లో అతనికి సింపతీ పెరిగింది. ఆ కారణంగానే అతని ఓటింగ్ పెరిగింది. ఇక ప్రశాంత్ కూడా నామినేషన్స్ లో లేకపోవడంతో.. అతని ఓట్లన్నీ భోలేకి వచ్చాయి.   

ఇక మూడో స్థానంలో అమర్ దీప్, నాలుగో స్థానంలో అశ్విని, ఐదవ స్థానంలో గౌతమ్, ఆరో స్థానంలో ప్రియాంక ఉన్నారని సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభా నిలిచారు. వీరి మధ్య ఓటింగ్ లో కూడా పెద్దగా తేడా లేదు. కారణం చాలా రోజులుగా సందీప్ ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఒక్కసారి నామినేషన్స్ లోకి వస్తే అతన్ని బయటకు పంపడానికి ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. అనుకుకున్నట్టుగానే ఈవారం నామినేషన్స్ లోకి వచ్చాడు కానీ.. భోలే తో శోభా గొడవ వల్ల శోభాపై నెగిటివిటీ ఎక్కువగా     
పెరిగింది. దీంతో సందీప్ ఈ వారం కూడా ఎలిమినేషన్ తప్పించుకోనున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతోంది.

ఇక శోభా విషయానికి వస్తే.. కొన్ని వారాలుగా శోభా గేమ్, ఆమె ప్రవర్తన ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తోంది. ఆమె యాటిట్యూడ్ ఆటిట్యూడ్, ప్రతీదానికి నోరేసుకొని  పడిపోవడం వంటివి ప్రేక్షకుల్లో నెగిటివిటీకి కారణమైంది. దాంతో.. ఆమె నామినేషన్స్ లోకి ఎప్పుడు వస్తుందా అని చూశారు ఆడియన్స్.  దీంతో ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయమనే చెప్పాలి.