బిగ్ బాస్ 7 విజేత డిసైడ్ అయిపోయిందా.. గెలిచేది ఈమేనా?

బిగ్ బాస్ 7 విజేత డిసైడ్ అయిపోయిందా.. గెలిచేది ఈమేనా?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) మొదలైంది. అప్పుడే ఒక రోజు కూడా గడిచిపోయింది. నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. కంటెస్టెంట్స్ మధ్య పుల్లలు పెట్టడానికి బిగ్ బాస్ కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పటికే మొదలు పెట్టాడు కూడా. అందుకు రతికా రోజ్(Rathika rose) ను ఎంచుకున్నాడు బిగ్ బాస్.

అందుకు తగ్గట్టుగానే రతికా కూడా కంటెస్టెంట్స్ ను తన మాయలో పడేసింది. బిగ్ బాస్ తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ ను తెలివిగా టేస్టీ తేజాతో చేయించి తన స్ట్రాటజీను వర్కౌట్ చేసింది. పాపం ఇది తెలియని తేజ యావర్ అండ్ గౌతమ్ కృష్ణకు ఫిట్టింగ్ పెట్టేశాడు. ఈ టాక్ లో తన ప్లాన్ ను పర్ఫెక్ట్ గా అమలు చేసి ఆడియన్స్ మనసును గెలుచుకుంది రతికా రోజ్. 

నిజానికి రతికా మొదటిరోజు నుండి ఆడియన్స్ చూపు తనపై పడేలా చేసుకుంటూ వస్తోంది. స్టేజిపై హోస్ట్ నాగార్జునతో మాట్లాడినప్పుడు కూడా కాస్త కూడా తడబడకుండా చాలా దైర్యంగా తాను చెప్పాలనుకుంది చెప్పేసింది ఈ బ్యూటీ. టాలీవుడ్ ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన సరైన గుర్తింపు లభించలేదు ఈ అమ్మడుకు అందుకే తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చినట్టు తెలిపింది. వీటన్నితో ఆడియన్స్ లో రతికా పై ఒక పాజిటీవ్ ఒపీనియన్ వచ్చేసింది. దీంతో రతికా ఈ సీజన్ కు విన్నెర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అంతేకాదు రతికా గురించి బయట వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే. ఈ సీజన్ విన్నర్ గా రతికా రోజ్ ను డిసైడ్ చేసేశారట బిగ్ బాస్ టీమ్. ఆ విషయం ఆమెకు కూడా తెలుసని, అందుకే ఆమె అంత ధీమాగా ఉంటోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.