శేఖర్ భాషా కి గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున.. ఎలిమినేషన్ తప్పదా..?

శేఖర్ భాషా కి  గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున.. ఎలిమినేషన్ తప్పదా..?

బిగ్ బాస్ 13వ రోజు ప్రోమో  యూట్యూబ్ లో విడుదలైంది. అయితే ఈ ప్రోమో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ శేఖర్ భాషా కి గుడ్ న్యూస్ చెప్పడంతో స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో శేఖర్ భాషా తండ్రి అయ్యాడని, బేబీ బాయ్ జన్మించాడని గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో శేఖర్ భాషా కొంతమేర ఎమోషనల్ అయ్యాడు. అలాగే తోటి కంటెస్టెంట్లు శేఖర్ భాషాకి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. తర్వాత సీతకి పర్ఫార్మెన్స్ కి కిర్రాక్  ఇచ్చారు. దీంతో సీత ఫుల్ హ్యాపీ అయ్యింది.

ఇక ఆదిత్యకి చీఫ్ తో ఉన్న సమస్య గురించి మాట్లాడుతూ చీఫ్ తో ఏదైనా సమస్య ఉంటే నేరుగా చీఫ్ తో మాట్లాడాలని చెప్పగా ఆదిత్య ఏజ్ గ్యాప్ కారణంగా మాట్లాడలేకపోయానని ఆదిత్య చెప్పాడు. దీంతో హోస్ట్ నాగార్జున ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టే వెళ్లి కూర్చుని మాట్లాడి  సమస్య పరిష్కరించుకోవాలన్నట్లు  సూచించాడు. 

Also Read :- మత్తు వదలరా -2 చిత్రంపై సినీ ప్రముఖుల ప్రశంసలు

ఇక ఆ మధ్య హౌజ్ లో సోనియా విష్ణు ప్రియ విషయంలో నోరు జారిన విషయాన్ని కూడా ప్రస్తావించి నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నాడు. దీంతో సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం సోనియా చెయ్యగా నాగార్జున ఏకంగా కీప్ క్వైట్ అంటూ సీరియస్ అయ్యాడు.  అలాగే చీఫ్ గా నైనికా మరియు సోనియాని తొలగిస్తున్నట్లు చెబుతో ప్రోమో ని ఎండ్ చేశారు. 

అయితే బిగ్ బాస్ మొదటివారం ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే. దీంతో రెండోవారం ఎలిమినేషన్స్ పై కొంతమేర ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే శేఖర్ భాషా ఎలిమినేషన్ దాదాపుగా ఖాయమైనట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.