
బాలీవుడు నటుడు సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్..ఇతని గురించి తెలియనివారుండరు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అతని సోదరి దివ్య బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తుండంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
పాట్నాలోని ది ఘా అసెంబ్లీ నియోజవకర్గం నుంచి సీపీఐ (ఎంఎల్) పార్టీ తరపున దివ్య పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యార్థినిగా ఆమె రాజకీయ నేపథ్యం, బాలివుడ్ స్టార్ అయిన తన సోదరుడు సుశాంత్ సింగ్ కుటుంబంనుంచి రావడంతో ఆమె నామినేషన్ అందరి దృష్టిని ఆకర్షించింది.
పాట్నా యూనివర్సిటీనుంచి మాస్ కమ్యూనికేషన్ డిగ్రీని పొందారు దివ్య. ఆమెకాలేజీలో చదివే రోజులనుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 2012లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) టికెట్ పై పాట్నా యూనివర్సిటీ విద్యార్థి సంఘం (PUSU) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
దిఘా నియోజకవర్గంలో..
దిఘా నియోజకవర్గం సీటు ప్రస్తుతం BJP ఆధీనంలో ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి చెందిన సంజీవ్ చౌరాసియా 97వేల044 ఓట్లతో ఈ స్థానాన్ని గెలుచుకోగా, CPI(ML)కి చెందిన శశి యాదవ్ 50వేల971 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఎన్నికలకు కూటమిలో భాగంగా సీపీఐ (ఎంఎల్) పార్టీకి ఈస్థానం దక్కింది. దివ్య గౌతమ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6 ,11 తేదీలలో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ ఫలితాలు వెలువడతాయి. దిఘా నుంచి దివ్య గౌతమ్ పోటీకి కొత్త కోణాన్ని జోడించింది.