బీహార్ బ్లాస్ట్ కేస్: ఇద్దరు లష్కరే తీవ్రవాదుల అరెస్ట్

బీహార్ బ్లాస్ట్ కేస్: ఇద్దరు లష్కరే తీవ్రవాదుల అరెస్ట్
  • దర్బాంగ జిల్లాలో పేలుళ్లలో కేసు నిందితుల్లో హైదరాబాదీలు ఇమ్రాన్, నజీర్ ఖాన్

హైదరాబాద్: బీహార్ లోని  దర్బాంగా జిల్లాలో బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు లష్కరే తొయిబా తీవ్రవాదులను బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన  ఇమ్రాన్, నజీర్ లకు లష్కరే తొయిబా తో సంబంధాలు ఉన్నట్లు ఎన్ ఐ ఏ ధృవీకరించింది.  హైదరాబాద్ నాంపల్లి చెందిన ఇమ్రాన్ మాలిక్, నాజిర్ మాలిక్ యూపీ నుంచి స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు. వీరిద్దరి కోసం గాలిస్తున్న ఎన్ఐఏ ఎట్టకేలకు వారి ఆచూకీ కనుక్కుని అదుపులోకి తీసుకుంది. వీరిద్దరిని విచారించగా భారీ కుట్ర ప్లాన్ వెల్లడైంది. 
దేశమంతా పేలుళ్లతో తీవ్రవాద ప్రాబల్యానికి ప్లాన్
ఎన్ఐఏ విచారణలో హైదరాబాదీ నిందితుల వెనక లష్కరే తొయిబా తీవ్రవాద సంస్థ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీరు ఇండియా మొత్తం తీవ్రవాదానికి ప్లాన్ వేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా భారీగా ప్రాణ నష్డం చేయాలని ప్లాన్ చేశారు. దీని కోసం పాకిస్తాన్ నుంచి నిధుల సమీకరణ చేపట్టారు. ఇందులో భాగంగా 2012 లోనే నజీర్ ఖాన్ పాకిస్థాన్ వెళ్లివచ్చినట్లు విచారణలో వెల్లడైంది. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఎన్ ఐ ఏ స్పెషల్ కోర్ట్ లో హాజరుపరిచారు పోలీసులు.