బీహార్ సీఎం నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీహార్ సీఎం నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

జనాభా నియంత్రణపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణలో మగాళ్లు బాధ్యతగా ఉండరని చెప్పారు. దీనిపై మహిళలకు సరైన అవగాహన లేదని..దాని వల్లే  సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. వైశాలిలో ఓ పబ్లిక్ మీటింగ్‌లో  నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మగాళ్లకు ఏమీ పట్టదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని వాళ్లు ఆలోచించరు.  మహిళలకు  దానిపై సరైన అవగాహన ఉండదు. మహిళలు వద్దు అని చెప్పలేకపోవడం వల్లే జనాభా నియంత్రణ జరగడం లేదు. మహిళల్లో ఎప్పుడైతే  అవగాహన పెరుగుతుందో అప్పుడే  అది సాధ్య పడుతుంది. గర్భం దాల్చకుండా మహిళలు తమను తాము రక్షించుకోవడం  తెలుసుకోవాలి"...అని సీఎం - నితీశ్ కుమార్ అన్నారు.  

నితీష్ కుమార్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బిహార్ రాష్ట్ర ప్రతిష్ఠను నితీష్ కుమార్ దిగజార్చారని బీజేపీ నేత సామ్రాట్ చౌదరి నితీష్‌ విమర్శించారు. సీఎంగా ఉండి అలాంటి భాష వాడటం దారుణమన్నారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికే మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు.