
- మహిళలపై అఘాయిత్యాలకు పోర్న్ కూడా కారణమే
దేశంలో పోర్న్ సైట్స్‌పై నిషేధం విధించాలని కోరుతూ బీహార్ సీఎం నితిశ్ కుమార్.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇంటర్నెట్‌లో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ ఎక్కువైందని, దీన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. పోర్న్ కంటెంట్ వల్ల దీర్ఘకాలంలో దాన్ని చూసే వారి మెదడుపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని నితిశ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మానసికంగా వారి ఆలోచనా తీరులో మార్పు వస్తుందని చెప్పారు. మహిళలపై దాడులు, అకృత్యాలకు పెరగడానికి ఇది కూడా ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోడీకి బీహార్ సీఎం రాసిన లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది. మహిళలపై నేరాలు తగ్గించడానికి.. పోర్న్, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌ను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని నితిశ్ కుమార్ డిమాండ్ చేశారు.