బీహార్ ఎన్నికల మొదటి విడుత పోలింగ్ ప్రారంభం

బీహార్ ఎన్నికల మొదటి విడుత పోలింగ్ ప్రారంభం

ఈరోజు 71 సీట్లకు పోలింగ్

కరోనా జాగ్రత్తలతో ఏర్పాట్లు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇయ్యాల్టి నుంచే ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఫేజ్​లో 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరోనా కారణంగా ఎలక్షన్ కమిషన్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. పోలింగ్ బూత్ లలో రద్దీని నివారించేందుకు ఒక్కో సెంటర్ లో ఓటర్ల సంఖ్యను 1,600 నుంచి వెయ్యికి కుదించింది. 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. ఈవీఎంలను శానిటైజ్, ఓటర్లకు థర్మల్ స్ర్కీనింగ్ చేయాలని, పోలింగ్ బూత్ లలో హ్యాండ్ శానిటైజర్, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది. ఓటర్లు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 71 నియోజకవర్గాల్లో 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది.

బరిలో 1,066 మంది

ఫస్ట్ ఫేజ్ లో అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,066 మంది క్యాండిడేట్లు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 952 మంది మగవాళ్లు, 114 మంది ఆడవాళ్లు ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 35 సీట్లలో, బీజేపీ 29, ఆర్జేడీ 42, కాంగ్రెస్ 20, ఎల్జేపీ 41 సీట్లలో పోటీ చేస్తున్నాయి. ఓవైపు జేడీయూ–బీజేపీ, మరోవైపు ఆర్జేడీ–కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. ఎల్జేపీ ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. స్టేట్ కేబినెట్ లోని ఆరుగురు మినిస్టర్లు తొలి దశ ఎన్నికల్లోనే పోటీలో ఉన్నారు.

34 శాతం మందిపై క్రిమినల్ కేసులు

సెకండ్ ఫేజ్​లో పోటీ చేస్తున్న 1,463 మంది క్యాండిడేట్లలో 502 మంది(34%) పై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది.