
పెళ్లివారమండీ.. మగ పెళ్లి వారమండీ..మా పాట్లు వినేది ఎవరండీ అంటూ పాటలు పాడుకుంటున్నారు పెళ్లి కాని ప్రసాద్ లు. అమ్మాయి నచ్చింది. వంట చేయడం వచ్చా..? పెళ్లి తరువాత ఉద్యోగం చేస్తుందా..? ఇలాంటి యక్ష ప్రశ్నలు వేసే రోజులు మారాయ్.
గతంలో కట్నం ఎంతిస్తారు. ఆ తరువాత కట్నం వద్దులేండి. ఘనంగా పెళ్లి జరిపించండి. మరి ఇప్పుడు కట్నం వద్దు. పెళ్లి మేమే చేస్తాం. అమ్మాయి తాళి కట్టించుకుంటే సరిపోతుందనే పరిస్థితికి చేరింది. దీంతో అమ్మాయిలు తల్లిదండ్రుల ఇష్టంతో వారికి నచ్చిన భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే ఎదుటి వారిని నొప్పించకుండా మేం ఇంకా చదువుకోవాలి. లేదంటే మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుందని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో అబ్బాయిలు పెళ్లి కావడంలేదు మొర్రో అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇదిగో ఇలాగా. బీహార్ లో ఓ మీడియా సంస్థ పెళ్లిళ్లు, కట్నాల గురించి ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా బీహార్ లో ఓ యువకుడు..,మమ్మల్ని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. మాకు కట్నాలు వద్దు. ఫ్రీగానే పెళ్లి చేసుకుంటాం. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అంటూ సదరు యువకుడు మహిళా రిపోర్టర్ అడిగిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Not an easy thing to interview someone from #Bihar ? pic.twitter.com/MCQvd0R8yF
— Arun Bothra (@arunbothra) November 6, 2020