కామారెడ్డిటౌన్, వెలుగు : పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన ఘటనలో బీహార్‌కు చెందిన రాహుల్ కుమార్‌ను అరెస్ట్‌చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ మాట్లాడుతూ బీహార్‌కు చెందిన రాహుల్ కుమార్ మణికంఠ రైసుమిల్లో లేబర్‌గా పని చేస్తున్నాడన్నారు. అక్టోబర్ 26న ఫరీద్‌పేట్‌కు చెందిన మహిళ వ్యవసాయ పనులకు వెళ్తుండగా ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించినట్లు తెలిపారు.
ఘటన తర్వాత నిందితుడు పరారీ అయ్యాడన్నారు. 7 టీమ్స్ ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకునేందుకు బీహార్, మహారాష్ర్టకు పంపామన్నారు. మహారాష్ర్టలోని గోండియా ఏరియాలో పట్టుకున్నామని తెలిపారు. రూరల్ సీఐ రామన్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.
