గట్స్ ఉన్న లేడీ కానిస్టేబుల్ : నేను నీ పని మనిషిని కాదు.. సర్కార్ ఉద్యోగిని.. మేజిస్ట్రేట్ షాక్

గట్స్ ఉన్న లేడీ కానిస్టేబుల్ : నేను నీ పని మనిషిని కాదు.. సర్కార్ ఉద్యోగిని.. మేజిస్ట్రేట్ షాక్

నేను ఏమన్నా నీ ఇంట్లో పని మనిషినా.. నేను నీకు సేవ చేయటానికి ఉన్నానా.. నేను ప్రభుత్వ ఉద్యోగిని.. నీకు సేవ చేయటానికి లేను.. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా ఓ సాధారణ మహిళా కానిస్టేబుల్.. ఈ మాటలు ఎవరితో అన్నదో తెలుసా మెజిస్ట్రేట్ తో.. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఓ మహిళా కానిస్టేబుల్.. మేజిస్ట్రేట్ ను ప్రశ్నించిన తీరుకు నెటిజన్లు హ్యాట్సాప్ అంటుంటే.. ఈ విషయంపై ఆ మహిళా కానిస్టేబుల్ వెంటే.. మిగతా కానిస్టేబుళ్లు నిలబడటం.. ఇప్పుడు ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బీహార్ లోని పాట్నాలో దిఘా ఘాట్ వద్ద గంగానదిలో చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర పశుసంవర్థక శాఖ నిర్వహించింది. నవంబర్ 30న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ కు , మేజిస్ట్రేట్ కు మధ్య వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఈవెంట్ భద్రత కోసం ఉదయం నుంచి పోలీసులు అక్కడ మోహరించారు. కార్యక్రమానికి విపి గుప్తా మేజిస్ట్రేట్ గా వచ్చారు. కార్యక్రమం ప్రారంభమయ్యే ముందుకు నీరు తీసుకురావాలని మేజిస్ట్రేట్.. ఓ మహిళా కానిస్టేబుల్ ను కోరాడు. అప్పటికే కనీసం టిఫిన్ కూడా చేయని పోలీస్ సిబ్బంది ఆకలితో ఉన్నారు. ఈ క్రమంలో నీరు తెమ్మని మేజిస్ట్రేట్ చెప్పడంతో మహిళా కానిస్టేబుల్ తిరస్కరించడంతో వివాదం తలెత్తింది. 

మేజిస్ట్రేట్  ను ప్రశ్నిస్తూ.. నేను ప్రభుత్వ ఉద్యోగిని..ఎందుకు నీరు తీసుకురావాలి.. నీ సేవకురాలని కాదు అని బల్లగుద్ది చెప్పింది. దీంతో వివాదం నెలకొంది. పోలీసులంతా కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోతోపాటు ఇలా రాసింది. మేము వారి సేవకులమా? మేం ప్రభుత్వ సేవకులం.. అతనికి వ్యక్తిగత సేవకుడు ఉన్నారు కదా.. మేం ఉదయం నుంచి అల్పాహారం చేశామా అని అడిగారా.. మమ్మల్ని నీరు అడుగుతున్నారు. అప్పుడు మా ముఖం చూశాడా అని ప్రశ్నిస్తూ రాసింది మహిళా కానిస్టేబుల్. 

నేను నీరు అడగడం ప్రాథమిక మానత్వాన్నికి సంబంధించిన విషయం.. నీరు అడిగితే ఎవరైనా ఇస్తారు.. నేను కూడా ఇంటినుంచి చాలా బాటిళ్లలోనీరు తెచ్చాను.. అందరికీ ఇచ్చాను.. ఇది ఆమె వ్యక్తిగత ప్రతిష్ట కు భంగం కలిగినట్లు అనుకుంటే.. డీఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు ఆ మేజిస్ట్రేట్.