బీహార్​ ఎమ్మెల్యే లలన్​ పాశ్వాన్ వివాదాస్పద కామెంట్లు

బీహార్​ ఎమ్మెల్యే లలన్​ పాశ్వాన్ వివాదాస్పద కామెంట్లు

పాట్నా: హిందూ దేవతలనుద్దేశించి బీహార్ బీజేపీ ఎమ్మెల్యే లలన్​ పాశ్వాన్​ వివాదాస్పద కామెంట్లు చేశారు. హిందువుల నమ్మకాలను ఆయన తప్పుపట్టారు. తన వాదనలను తప్పు అని చూపించేందుకు ఆధారాలు చూపించాలని వాదించారు. 

ఆయన అన్నదేంటంటే.. 

దీపావళినాడు లక్ష్మీ దేవిని హిందువులు ఎందుకు పూజిస్తారని పాశ్వాన్ ప్రశ్నించారు. లక్ష్మిని పూజిస్తేనే డబ్బులు వస్తాయనుకుంటే.. అపుడు ముస్లిం మతస్తులలో ఆస్తిపరులు ఉండేవారే కాదన్నారు. ముస్లింలు లక్ష్మిని పూజించరు కాబట్టి వాళ్లు ధనవంతులు కాదా? అలాగే సరస్వతీ దేవిని పూజించనంతమాత్రాన వాళ్లలో పండితులు లేరా? ఐఏఎస్​లు, ఐపీఎస్​లు కాలేదా? అని లలన్ ప్రశ్నించారు. ఆత్మ, పరమాత్మ అనేది నమ్మకం మాత్రమేనని అన్నారు.

‘‘హనుమాన్ మహా శక్తి కలిగినోడని నమ్ముతం. కానీ, ముస్లింలు, క్రిస్టియన్లు బజరంగబలిని పూజించరు. అంటే.. వాళ్లు శక్తిమంతులు కాదా?”అని లలన్ ప్రశ్నించారు. మీరు నమ్మితేనే దేవుళ్లు, లేదంటే రాతి విగ్రహాలేనని అన్నారు. దేవుళ్లను నమ్మాల్నా వద్దా అనేది మన ఇష్టమని, సైంటిఫిక్ నేచర్​తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మనం నమ్మకాలు వదిలేస్తేనే మన టాలెంట్ పెరుగుతుందన్నారు. ఈ కామెంట్లపై స్థానిక హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.