
బీహార్ లో కానిస్టేబుళ్ల ఎంపికపై ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యేందుకు అభ్యర్ధులు పడరాని పాట్లు పడుతున్నారు.
ముజఫర్ పూర్ కు చెందిన ఓ హాల్లో కానిస్టేబుల్ ఎంపిక కోసం రిటర్న్ ఎగ్జామ్ రాస్తున్న ఓ అభ్యర్ధి సడెన్ గా తన చెవి నొప్పిగా ఉన్నాయని, వైద్యుల్ని పిలవాలంటూ ఇన్విజిలేటర్ ను కోరాడు. ఇన్విజిలేటర్ భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం చెవినొప్పితో బాధపడుతున్న అభ్యర్ధిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆ అభ్యర్ధికి చెవి నొప్పి ఎందుకు వస్తుందో అర్ధం కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి పరీక్షించారు. ఒంటిపై ఉన్న షర్ట్ తొలగించారు. లోపల షర్ట్ కు బాంబు వైర్ చుట్టినట్లు..ఇయర్ ఫోన్ ను చుట్టుకున్నాడు. చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకున్నాడు. ఆ ఇయర్ ఫోన్ చెవిలోపలికి పోవడంతో నొప్పి తీవ్రమై, ఇన్విజిలేరట్ ను సంప్రదించినట్లు పోలీస్ అధికారి నిషార్ అహ్మద్ చెప్పారు. నిందితుణ్ని ఆస్పత్రికి తరలించి చెవిలో ఇరుక్కున్న ఇయర్ ఫోన్ తీసి..కేసు నమోదు చేస్తామని నిషార్ అన్నారు.