బీహార్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిని కాల్చి చంపారు

బీహార్‌లో దారుణం..  నాలుగేళ్ల చిన్నారిని కాల్చి చంపారు

బీహార్‌లోని పాట్నాలోని రూపస్‌పూర్ ప్రాంతంలో 2024 జులై 03వ తేదీ మంగళవారం రాత్రి నాలుగేళ్ల బాలికను ఆమె ఇంటి బయట గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. బాధితురాలు తన కుటుంబంతో కలిసి అద్దెకు ఉంటుంది.  మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఆమె తండ్రి హరి ఓం కుమార్ రాత్రి పొద్దుపోయేసరికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యులు చిన్నారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు మరియు ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.