సోనూసూద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఇసుకబట్టీ కార్మికుడు

సోనూసూద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఇసుకబట్టీ కార్మికుడు

ప్రతిభ ఉంటే చాలు డబ్బులున్నా లేకున్నా గుర్తింపు ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది అనడానికి ఈ స్టోరీ గురించి చెప్పొచ్చు. ట్విట్టర్‭లో దిల్ దే దియా హై పాటను పాడి బీహార్‭కు చెందిన ఓ ఇసుక బట్టీ కార్మికుడు ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అతడి పాటను విన్న సోనూసూద్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అతడి వాయిస్‭కు ఫిదా అయి.. ఏకంగా తన నెక్ట్స్ సినిమా ఫతేహ్ లో పాట పాడేందుకు అతడికి ఛాన్స్ ఇచ్చాడు.

బీహార్‌లోని సమస్తి‌పూర్‌కు చెందిన అమర్‌జీత్ అనే యువకుడికి చిన్నప్పటి నుంచి పాటలంటే ప్రాణం. ఇటుక బట్టీలో పనిచేసే అతడు బాలీవుడ్ పాటలు పాడుతూ ఆ వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఇటీవల అతడు పాడిన ‘దిల్ దే దియా హై’ పాట వీడియోకు సోషల్ మీడియాలో ఫుల్ రిస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోను పది లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రముఖ నటుడు సోనూసూద్, నటి నీతూ చంద్ర, ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ ఆ వీడియోను రీ ట్వీట్ చేశారు. సోనూసూద్ అమర్ జీత్ ఫోన్ నంబర్ తెలుసుకుని మరి అతడితో మాట్లాడారు. కాగా సినిమాలో పాట పాడే ఛాన్స్ రావడం పట్ల యువకుడి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ పాట రికార్డింగ్ కోసం అమర్ జీవ్ ముంబాయికి వెళ్లనున్నాడు.