వరుస దొంగతనాలు.. ఇద్దరు అరెస్ట్

వరుస దొంగతనాలు.. ఇద్దరు అరెస్ట్

వికారాబాద్, వెలుగు: సిటీలో బైక్​లను చోరీ చేసి తాండూరులో అమ్ముతున్న ముగ్గురిని వికారాబాద్ జిల్లా యాలాల పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తాండూరు డీఎస్పీ ఆఫీసులో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.వికారాబాద్ జిల్లా యాలాల మండలం కమాల్పూర్ గ్రామానికి బోయిని శ్రీకాంత్, మ్యాతరి బాస్కర్,  మ్యాతరి శివ ముగ్గురు ఫ్రెండ్స్. వీరంతా సిటీలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సంపాదన సరిపోకపోవడంతో బైక్ చోరీలకు స్కెచ్ వేశారు. సిటీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి పార్కింగ్ లో ఉన్న బైక్ లను ఎత్తుకెళ్లడం మొదలుపెట్టారు.

4 నెలలుగా సిటీలో బైక్ లను దొంగిలిస్తూ వాటిని తాండూరుకు తీసుకొచ్చి తక్కువ రేటుకు అమ్ముతున్నారు. మాదాపూర్,  కూకట్ పల్లి, మియాపూర్,  బంజారాహిల్స్,  బాచుపల్లి, చందానగర్, యూసుఫ్ గూడతో పాటు యాలాల మండలంలో దొంగతనాలు చేశారు. బాధితుల కంప్లయింట్ మేరకు యాలాల పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం యాలాల పోలీసులు లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా.. శ్రీకాంత్, భాస్కర్, శివ సరైన పేపర్లు లేని బైక్ లతో పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 20 బైక్ లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

వరుస దొంగతనాలు.. ఇద్దరు అరెస్ట్

జీడిమెట్ల: వరుస చోరీలు చేస్తున్న ఇద్దరిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.  సూరారంలోని రాజీవ్​గృహకల్పకు చెందిన ​ఫయాజ్(22),  వెల్డర్​గా పని చేస్తున్నాడు.  ఢిల్లీకి చెందిన మహ్మద్ జుమ్మన్​(35) గాజులరామారం రోడామిస్త్రీ నగర్​కు వచ్చి ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు చోరీలు చేయడం మొదలుపెట్టారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, దుండిగల్ పీఎస్ ల పరిధిలో14 చోరీలు చేశారు. బాధితుల కంప్లయింట్​తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన జీడిమెట్ల పోలీసులు సోమవారం తెల్లవారుజామున షాపూర్​నగర్​లో ఫయాజ్, జుమ్మన్ ను అదుపులోకి తీసుకున్నారు. రూ.4 లక్షల విలువైన 61.34 గ్రాముల బంగారం, 454.24 గ్రాముల వెండి, 2 బైక్ లు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫయాజ్ పై 21, జుమ్మన్​పై 14 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.