హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు బిల్ గేట్స్

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  ఇండియా డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ను మైక్రోసాఫ్ట్ కో–ఫౌండర్​బిల్ గేట్స్ సందర్శించినట్లు కంపెనీ తెలిపింది. కొంతమంది ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగించారని మైక్రోసాఫ్ట్ ఐడీసీ  మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఏఐ- ఆధారిత భారతదేశం గురించి ఆయన మాట్లాడారని వెల్లడించారు.  ఈ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ ఇటీవలే తన 25వ వార్షికోత్సవం జరుపుకుంది.  

అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపైలట్  ఇతర ఏఐ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వంటి ప్రపంచ-స్థాయి ఉత్పత్తులను రూపొందించడంలో ఐడీసీ కీలక పాత్రను పోషిస్తోంది. ఐడీసీ నుంచి మైక్రోసాఫ్ట్ కోసం - ఏఐ,  క్లౌడ్ నుంచి కొత్త ఇన్నోవేషన్లను తీసుకొస్తామని కుమార్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల తన ఇటీవలి ఇండియా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ ఏఐలో మనదేశానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు.