బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్.. రీ ఓపెన్ రోజే 80 స్పీడ్

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్.. రీ ఓపెన్ రోజే  80 స్పీడ్

హైదరాబాద్‌‌, వెలుగు:  బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్  శనివారం రీ ఓపెన్ కావడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.  ఐదుగురి ప్రాణాలు బలిగొన్న ఫ్లై ఓవర్‌‌పై ఎక్స్ పర్ట్స్ కమిటీ సూచనల మేరకు గరిష్ఠ వేగం 40కి మించకుండా అన్ని చర్యలు చేపట్టామని..నిర్మాణం పూర్తిగా ఐఆర్ సీ రూల్స్ ప్రకారమే ఉందని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. కానీ ఎక్స్ పర్ట్స్ రిపోర్టులో అది వాస్తవం కాదని తేలిపోయింది. వరుస ప్రమాదాలు జరగడంతో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ ను మూసివేసి నెలన్నర రోజుల తర్వాత తిరిగి ప్రారంభించారు. 990 మీటర్లు ఉండే ఈ ఫ్లైఓవర్ పై గంటలకు 40కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అనుమతించే విధంగా, అందుకు అవసరమైన రంబ్లర్లు, ఇండికేషన్ బోర్డులను ఏర్పాటు చేసి భద్రతకు సంబంధించి ఎక్స్ పర్ట్స్ కమిటీ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు.  మేయర్‌‌ఫ్లైఓవర్ ని ప్రారంభించిన మొదటి రోజే బైక్‌‌లు, కార్లు 50 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగం వరకూ ప్రయాణించడం గమనార్హం.
అక్కడ ఏర్పాటు చేసిన మైక్‌‌ల ద్వారా టూవీలర్లు ఫ్లైఓవర్‌‌పై కేవలం ఎడమ వైపు మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నా.. ఇష్టారీతిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. వేగం, ఫ్లైఓవర్ ప్రమాద అవకాశాలపై స్థానికులు, వాహనదారుల్లో అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే పూర్తిస్థాయిలో సురక్షితంగా మార్చవచ్చు. మరో నెల రోజుల పాటు ఫ్లైఓవర్‌‌పై వాహనాల రాకపోకలు గమనించి తదుపరి చర్యలు తీసుకుంటామని సీఈ శ్రీధర్‌‌చెబుతున్నారు.

 ఐఆర్‌‌సీ రూల్స్ ప్రకారం..

ఫ్లైఓవర్‌‌నిర్మాణంలో ఎలాంటి ఇంజినీరింగ్‌‌వైఫల్యాలు లేకున్నా కేవలం వాహనదారుల అతివేగం కారణంగానే ప్రమాదాలు జరిగాయని  మేయర్‌‌ శనివారం స్పష్టం చేశారు. అంతకుముందు బల్దియా ఇంజినీరింగ్‌‌విభాగం అధికారులు కూడా పదేపదే ఐఆర్‌‌సీ రూల్స్ ప్రకారమే నిర్మాణం చేపట్టామని తమ పొరపాటు లేవని చెబుతూ వచ్చారు. ఫ్లైఓవర్‌‌నిర్మాణంలోని పలు అంశాల్లో ఐఆర్‌‌సీ రూల్స్ ని పాటించడం లేదని, వాటిని అమలు చేయాలని ఎక్స్ పర్ట్స్ కమిటీ తమ రిపోర్టులో సూచించడం గమనార్హం. ఐఆర్‌‌సీ రూల్స్ ప్రకారం ఫ్లైఓవర్‌‌ప్రారంభంలో నిర్మాణం, రూట్‌‌అంశాలు సూచించే గాంట్రీ సైన్‌‌బోర్డు ( ఓఆర్‌‌ఆర్‌‌ప్రారంభంలో ఇవి కనిపిస్తాయి) ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రంబ్లర్లు స్ట్రిప్స్‌‌ఉన్నాయని సూచించే సైన్‌‌బోర్డులు కూడా రూల్స్ ప్రకరాం లేవని పేర్కొంది. గతంలో నెమ్మదిగా వెళ్లాలని సూచించాలని ఉన్న బోర్డుల స్థానంలో నిబంధనల ప్రకారం ‘40కిలోమీటర్ల వేగం’ సైన్‌‌బోర్డులను ఏర్పాటు చేశారు. క్యారేజ్‌‌వే నిర్మాణం గురించి ఐఆర్‌‌సీ నిబంధనలకు తగినట్టుగా సూచించడం లేదని ఆ మేరకు చర్యలు చేపట్టాలని సూచించింది. ఐఆర్‌‌సీని అమలు చేయలేని పక్షంలో బ్రిటీష్‌‌కోడ్స్‌‌లేదా ఎంయూటీసీడీ సైన్స్‌‌ను ఉపయోగించొచ్చని పేర్కొంది. ఐఆర్‌‌సీని అమలు ఫ్లైఓవర్‌‌ఎగ్జిట్‌‌వద్ద కింది నుంచి వచ్చే వాహనాలతో కలవాల్సి ఉంటుంది. ఆ ప్రదేశంలో వేగాన్ని హెచ్చరించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.