అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి : విద్యా శాఖ

అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి :   విద్యా శాఖ

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్  అటెండెన్స్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ నుండి యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్లు, సిబ్బందికి బ‌యో మెట్రిక్ హాజ‌రును త‌ప్పనిస‌రి చేసింది.

ఈ మేరకు విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ అదేశాలు జారీ చేశారు. ఇందకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని కోరారు. స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను విడుద‌ల చేసేందుకు హాజ‌రు శాతాన్ని తెలుసుకునేందుకు బ‌యోమెట్రిక్ ఉపయోగపడుతుందని  ఉత్తర్వుల్లో పేర్కొంది.