
మల్హర్ (మహాదేవపూర్), వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పుష్కరాల నేపథ్యంలో నిర్మిస్తున్న సరస్వతీ విగ్రహం ఏర్పాటు, వీఐపీ ఘాట్, టాయిలెట్స్ నిర్మాణం, టెంట్ సిటీ, ఫుడ్ కోర్టు, ఎగ్జిబిషన్, స్టాళ్లు ఏర్పాటు పనులను అధికారులతో కలిసి పరిశీలించి, ఈ నెల 10 వరకు అన్ని కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీపీవో వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.