
దేశ సరిహద్దులో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఎలాంటి పరిస్థితి వచ్చినా మా సిబ్బంది సమర్ధంగా ఎదుర్కొంటారని చెప్పారు. LOCలో బలగాల మోహరింపుతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రావత్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కూడా కశ్మీర్ ప్రశాంతంగానే ఉందని చెప్పారు రావత్. ఆయుధాలు లేకుండా ప్రజలను కలుసుకునే పరిస్థితి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు ఆర్మీ చీఫ్.