గద్వాల, వెలుగు: మావోయిస్టు అగ్రనేత పోతుల పద్మకు గురువారం నేటివిటీ సర్టిఫికెట్ జారీ చేశారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు పోతుల పద్మ ఈ నెల 13న పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆమె నేటివిటీ సర్టిఫికెట్ కోసం బుధవారం ఆమె తల్లి వెంకమ్మ, కుటుంబసభ్యులు తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకున్నారు.
రెవెన్యూ ఆఫీసర్లు గట్టు మండలం పెంచికలపాడు విలేజ్ లో గురువారం ఎంక్వైరీ చేశారు. అయిజలో చదువుకున్నప్పటి ఆరవ తరగతి సర్టిఫికెట్లు వెరిఫై చేశారు. గ్రామానికి చెందిన వెంకమ్మ, తిమ్మారెడ్డి కూతురేనని నిర్ధారిస్తూ నేటివిటీ సర్టిఫికెట్ ను జారీ చేశారు.
