కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ

టీమిండియా రన్ మెషీన్..కింగ్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తన ఆటతీరుతో అభిమానులను సంపాదించుకున్న కోహ్లీకి...సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌, ఉత్తమ బ్యాట్స్మన్ కోహ్లీకి బీసీసీఐ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కోహ్లీ  477 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడని,.. 24,350  పరుగులు చేశాడని బీసీసీఐ త‌న ట్వీట్‌లో పేర్కొంది. అంతేకాకుండా 2011 వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్ గెలిచిన టీమ్లో  కోహ్లీ ఉన్నాడ‌ని తెలిపింది.  2013లో ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ నెగ్గిన జ‌ట్టులోనూ కోహ్లీ సభ్యుడని వివరించింది. 

హ్యాపీ బర్త్ డే విరాట్..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు విరాట్ కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజా క్రికెటర్లతో పాటు..మాజీలు పరుగుల యంత్రానికి విషెష్ తెలుపుతున్నారు. టీమిండియా ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, చాహల్, శుభమాన్ గిల్ వంటి ప్లేయర్లు కోహ్లీకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

వీరితో పాటు మాజీ క్రికెటర్లు రైనా, రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, వసీం జాఫర్ కూడా విరాట్కు బర్త్ డే విషెష్ చెప్పారు.