గుండెపోటుతో యువతి మృతి

గుండెపోటుతో యువతి మృతి

లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన బీరుకుల హారిక(22) బుధవారం గుండెపోటుతో చనిపోయింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బీరుకుల ఎల్లన్నకు ముగ్గురు కూతుర్లు. హారిక మొదటి కూతురు. గతంలో ఈమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఈ క్రమంలో బుధవారం గుండెపోటు రావడంతో హారిక చనిపోయింది. ప్రభుత్వం బీరుకుల ఎల్లన్న కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ముత్యం రెడ్డి, స్థానికులు కోరారు.