నాసిరకం వస్తువులతో బిస్కెట్ల తయారీ.. నిందితుడు అరెస్ట్

నాసిరకం వస్తువులతో బిస్కెట్ల తయారీ.. నిందితుడు అరెస్ట్

రాష్ట్రంలో రోజు రోజుకు నాసిరకం వస్తువులు పెరిగిపోతున్నాయి. కల్తీ వస్తువులతో అక్రమార్కులు దందా చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఈ దందాలపై పోలీసులు ఎప్పటికప్పుడు చురకలంటిస్తున్నా.. ఎక్కడో ఒక దగ్గర కల్తీ పరిశ్రమలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో నాసిరకం వస్తులతో బిస్కట్లను తాయరు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.

అల్లాపూర్‌లో కల్తీ బిస్కట్ పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. నాసిరకమైన వస్తువులతో బిస్కట్లు తయారు చేసి.. మార్కెట్‌లో విక్రయిస్తున్న కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ బిస్కట్ల తయారీతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులు తెలిపారు. పరిశ్రమ చుట్టు పక్కల ప్రాంతాలన్ని కంపుకొడుతున్నాయని అధికారులు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పరిశ్రమ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ కలిపి వివిధ ప్లేవర్స్ బిస్కట్ తయారీకి నిర్వహకులు తెరలేపారన్నారు. వాటికి ఆకర్షనీయమైన లేబుల్స్ అతికించి మార్కెట్ లో విక్రయిస్తున్నారని చెప్పారు. పరిశ్రమలలో ఫుడ్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొదని తెలపారు. దీంతో భారీగా కల్తీ బిస్కట్స్‌లను ఎస్వోటీ బృందం సీజ్ చేసింది. కల్తీ బిస్కట్ పరిశ్రమ నడుపుతున్న షేక్ ఖదీర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.