Crypto News: రికార్డులు బద్ధలు కొట్టిన బిట్‌కాయిన్.. గోల్డ్-సిల్వర్ ఇన్వెస్టర్ల ఆసక్తితో..

Crypto News: రికార్డులు బద్ధలు కొట్టిన బిట్‌కాయిన్.. గోల్డ్-సిల్వర్ ఇన్వెస్టర్ల ఆసక్తితో..

Bitcoin Record: గడచిన కొన్ని నెలలుగా క్రిప్టో కరెన్సీలు ఇన్వెస్టర్ల తలరాతను మార్చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి బిట్‌కాయిన్ భారీ ర్యాలీని చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న వాణిజ్య రాజకీయ అనిశ్చితులతో ఇన్వెస్టర్లు సాంప్రదాయ పెట్టుబడి మార్గాలైన బంగారం, వెండి నుంచి క్రిప్టోలకు మారుతుండటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. 

ప్రస్తుతం ప్రముఖ క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్ రాకెట్ వేగంతో తన పాత రికార్డులను బద్ధలు కొడుతూ సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకుంది. నేడు బిట్‌కాయిన్ రేటు ఏకంగా లక్ష 24వేల డాలర్ల మార్కును అధిగమించి పెట్టుబడిదారులకు కనకవర్షం కురిపిస్తోంది. దీనికి ముందు సరిగ్గా నెలరోజుల కిందట అంటే జూలై 14న బిట్‌కాయిన్ లక్ష 23వేల 205 వద్ద రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. అమెరికా మార్కెట్లతో పాటుగా క్రిప్టోలు కూడా వేగంగా వృద్ధిని సాధించటంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి క్రిప్టోల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

ALSO READ : మొదటిసారిగా ఐపీఓకు ఏఐ కంపెనీ...

బిట్‌కాయిన్ ర్యాలీకి కీలక కారణాలు...
1. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత యూఎస్ ప్రభుత్వం క్రిప్టోలకు అనుకూల విధానాలను తీసుకురావటం.
2. కార్పొరేట్ కంపెనీలు కూడా బిట్‌కాయిన్ వంటి క్రిప్టోల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపటం.
3. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గుతున్న క్రమంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయనే అంచనాలతో గోల్డ్, సిల్వర్ లో పెట్టుబడి పెట్టిన చాలా మంది క్రిప్టోలను ఆశ్రయించటం ర్యాలీకి కారణాలుగా ఉన్నాయి. 

ప్రస్తుతం క్రిప్టో పెట్టుబడుల్లో 70 శాతం మార్కెట్ బిట్‌కాయిన్, ఈథర్ కలిగి ఉన్నాయి. బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈథర్ విలువ 575 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. 
 

మరిన్ని వార్తలు