10 రోజుల్లో 11 లక్షలు నష్టం

10 రోజుల్లో 11 లక్షలు నష్టం
  • రికార్డ్ లెవెల్ నుంచి 15 వేల డాలర్లు పడిన బిట్ కాయిన్
  • శుక్రవారం ఒక్క రోజే లక్ష 3.2 లక్షల డౌన్
  • • గంటలోనే రూ.16.50 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఆవిరి


న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ శనివారం సెషన్లోనూ మరో రెండువేల డాలర్లు నష్టపోయింది. ధనవంతులపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ను డబుల్ చేయాలని యూఎస్ ప్రభుత్వం చూస్తుండడం క్రిప్టోకరెన్సీపై నెగిటివ్ ప్రభావం చూపిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే ఓవర్గా పెరిగిన బిట్కాయిన్ లో ప్ రాఫిట్ బుకింగ్స్ చోటు చేసుటుకుంటున్నాయి. బిట్ కాయిన్ విలువ శుక్రవారం ఒక్క సెషన్లోనే 4.00 డాలర్లు నష్టపోయి 50 వేల డాలర్ల కిందకు పడింది. ఈ నెల 14న నమోదు చేసిన రికార్డ్ లెవె 64,778 డాలర్ల స్థాయి నుంచి 20 శాతానికి పైగా నష్టపోయింది. ఈ క్రిప్టోకరెన్సీ శనివారం. సెషన్లోనూ తన నష్టాల పరంపరను కొనసాగిం చింది. ఇంట్రాడేలో 47,659 డాలర్ల వరకు పడిన బిట్కాయిన్, తిరిగి రికవరీ అయ్యి 49,436 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

బిట్ కాయిన్ డౌన్ ట్రెండ్ ఉందా?

అతిపెద్ద క్రిప్టోఎక్స్చేంజ్ కాయిన్స్ మార్కెట్లో లి స్టింగ్ అవ్వడంతో దూసుకుపోయిన ఈ వర్చువల్ కరెన్సీ, గత కొన్ని సెషన్లలో నుంచి బేరిష్ ట్రెండ్ను చూపుతోంది. బిట్కాయిన్ ధరలు కిందటేడాది మూడింతలు పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే డబుల్ అయ్యాయి కూడా. కానీ, ఈ వర్చువల్ కరెన్సీ ఈ ఏడాదిలో ఇప్పటికే 75 శాతం లాభాలనిచ్చింది. ఏడాది కిందట కొని ఇప్పటి వరకు హోల్డ్ చేసిన వారికి 500 శాతానికి పైగా, ఏప్రిల్ 2019 లో కొని, హోల్డ్ చేసిన వారికి 800శాతం వరకు లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ కరెన్సీ ఓవర్ వాల్యుయేషన్లో ట్రేడవుతోంది. ఈ ఏడాది మార్చిలో 60 వేల డాలర్ల మార్క్ను క్రా స్ చేసినప్పటి నుంచి బిట్ కాయిన్ వేగం తగ్గిందని చెప్పారు. అప్పటి నుంచి తక్కువ రేంజ్లో ట్రేడవుతోందని అన్నారు. మరికొంతకాలం వరకు బిట్ కా యిన్ పడొచ్చని అంచనావేశారు. బిట్ కాయిన్ మా ర్కెట్ క్యాప్ శుక్రవారం సెషన్ మొదటి గంటలోనే 220 బిలియన్ డాలర్లు పడిందని పేర్కొన్నారు. యూఎస్ ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ను  డబుల్ చేస్తుందనే వార్తలతో పాటు, క్రిప్టోకరెన్సీలతో మనీ లాండరింగ్ చేస్తున్న అనేక సంస్థలపై యూ ఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోనుందని రూమర్లు క్రియేటయ్యాయి. ఇవి బిట్కాయిన్పై నెగిటివ్ ప్రభావం చూపుతున్నాయి. ఇతర క్రిప్టోక రెన్సీలు ఎథరమ్. ఎస్ఆర్పి వంటివి కూడా పడుతున్నాయి.

క్రిప్టో ఎక్స్చేంజ్లో 'టైగర్'


దేశీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్స్వచ్ కుబర్లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్ 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 187.5 కోట్ల) ను ఇన్వెస్ట్ చేసింది. క్రిప్టోలపై బ్యాన్ విధించాలని ప్రభుత్వం చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, టైగర్ గ్లోబల్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిరీస్ బీ రౌండ్ ఫండింగ్లో టైగర్ గ్లోబల్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ప్రస్తుతం కాయిన్ స్విచ్ వాల్యుయేషన్ 500 మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. ఈ ఏడాది జనవరిలో ఈ కంపెనీలో రిబిట్ క్యాపిటల్, పారడిమ్, సెకోయి క్యాపిటల్ ఇండియాలు 15 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. కాయిన్స్  స్విచ్  ను 2017 లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమకు 45 లక్షల మంది యూజర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. ఏడాది చివరిక లా కోటి మందికి పెంచుకోవాలని చూస్తోంది.